మెగాస్టార్ చిరంజీవి 150వ సినిమా ఖైదీ నెం.150తో రీ ఎంట్రీ ఇచ్చాడు. ఆ సినిమా తమిళ సినిమాకు రీమేక్ అనే విషయం తెల్సిందే. ఆ తర్వాత సైరా నరసింహారెడ్డి సినిమాను చేశాడు. ఆ సినిమాకు సంబంధించి నిర్మాత అయిన రామ్ చరణ్ నష్టాల పాలయ్యాడు. ఇక ప్రస్తుతం ఆచార్య సినిమాను చేస్తున్నాడు. కొరటాల శివ దర్శకత్వంలో చేస్తున్నాడు కనుక ఖచ్చితంగా సూపర్ హిట్ అవుతుందనే నమ్మకం వ్యక్తం అవుతోంది.
ఆ తర్వాత ఎలాంటి రిస్క్ తీసుకోకుండా మరో రీమేక్ ను ప్రేక్షకుల ముందుకు తీసుకు రావాలని భావించాడు. కాని కరోనాతో మొత్తం ప్లానింగ్ అంతా తలకిందులు అయ్యింది. లూసీఫర్ రీమేక్ కోసం సుజీత్ స్ర్కిప్ట్ వర్క్ చేశాడు. అయితే ఆ కథ నచ్చక పోవడంతో చిరంజీవి సుజీత్ ను రీమేక్ బాధ్యతల నుండి తప్పుకోవాలంటూ సూచించాడు.
ప్రస్తుతం ఆచార్య సినిమా చేస్తున్న చిరంజీవి ఆ తర్వాత లూసీఫర్ కాకుండా మరో తమిళ రీమేక్ కు ప్లాన్ చేస్తున్నాడు. దానికి మెహర్ రమేష్ దర్శకత్వం వహించబోతున్నాడు. ఈ విషయాన్ని ఇటీవలే పవన్ కన్ఫర్మ్ చేశాడు. చిరంజీవితో నువ్వు చేయబోతున్న సినిమా సక్సెస్ అవ్వాలంటూ కోరుకుంటున్నట్లుగా పవన్ ట్వీట్ చేశాడు. దాంతో చిరంజీవి తమిళ సినిమా రీమేక్ దాదాపుగా కన్ఫర్మ్ అయ్యిందని అంటున్నారు.
ఇదే సమయంలో లూసీఫర్ రీమేక్ బాధ్యతలను వివి వినాయక్ కు ఇచ్చినట్లుగా వార్తలు వచ్చాయి. కాని అవి ఏమాత్రం నిజం కాదని అసలు ఆలాంటి ఆలోచనే లేదు అంటూ ఇండస్ట్రీ వర్గాల నుండి టాక్ వినిపిస్తుంది. ప్రస్తుతానికి లూసీఫర్ సినిమాకు సంబంధించి ఎలాంటి అప్ డేట్ లేదు. కనుక సినిమా మొత్తానికి వదిలేసినట్లా అంటూ కొన్ని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.