ఈ కరోనా లాక్ డౌన్‌టైంలో సోనూసూద్ గురించి ఎక్కువగా మీడియాలో ప్రచారం జరిగింది. అంతకు ముందు వరకు విలన్ అంటూ ఆయన్ను సంభోదించే వారు. కాని ఇప్పుడు నిజమైన హీరో అంటూ అభిమానులు పిలుస్తున్నారు. సినిమాల్లో విలన్ పాత్రలో కనిపించిన సోనూసూద్ రియల్ లైఫ్ లో మాత్రం హీరో అన్నట్లుగా వ్యవహరించాడు.
కోట్లాది రూపాయలను సాయం చేసిన సోనూసూద్ ఇండియాలోనే ది బెస్ట్ హ్యూమన్ బీయింగ్ అంటూ ఆయన అభిమానులు అభివర్ణించారు. వేలాది మంది వలస కార్మికులు రోడ్లపై నడుచుకుంటూ వెళ్తుంటే ఆయన చూడలేక వందలాది మంది బస్సులను సొంత ఖర్చుతో ఏర్పాటు చేసి వారి వారి గమ్యస్థానాలకు చేర్చాడు.
రైళ్లు మరియు విమానంను కూడా బుక్ చేసి వలస కార్మికులను వారి గమ్య స్థానానికి చేర్చాడు. ఎడ్లు లేక ఇబ్బంది పడుతున్న రైతుకు ట్రాక్టర్ ఇచ్చాడు, ఉద్యోగం లేక ఇబ్బంది పడుతున్న అమ్మాయికి ఆర్థిక సాయం చేశాడు. ఇలా ఎన్నో రకాలుగా ఇప్పటిక కూడా సాయం చేస్తూనే ఉన్నాడు. బర్రెను కొనివ్వడం నుండి మొదలుకు ని లక్షల్లో సాయం చేస్తూ వస్తున్న సోనూసూద్ త్వరలో రాజకీయాల్లోకి వస్తాడేమో అంటూ ప్రచారం జరుగుతుంది.
దానిపై సోనూసూద్ స్పందించాడు. తనకు ప్రస్తుతం రాజకీయాలపై ఆసక్తి లేదని, అయితే భవిష్యత్తులు రాజకీయాల్లోకి వస్తే మాత్రం నూటికి నూరు శాతం ప్రజా సేవకు అంకితం అవుతాను అంటూ హామీ ఇచ్చాడు. ఇప్పుడు ఏం సేవ చేయాలన్నా కూడా నాదే తుది నిర్ణయం. కాని రాజకీయాల్లో ఉంటే నాపై ఉండే వారికి నేను సమాధానం చెప్పుకోవాల్సి ఉంటుందని, అప్పుడు స్వేచ్చగా సేవ చేయలేను అనేది ఆయన అభిప్రాయం.