చిరంజీవి హీరోగా కాజల్ హీరోయిన్‌గా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా ‘ఆచార్య’. ఈ సినిమాకు నిర్మాత ఎవరు అంటే ఠక్కున వినిపించే పేరు రామ్ చరణ్. అయితే తాజాగా సినీ వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా నిర్మాణం నుండి ఆయన దశల వారిగా తప్పుకున్నాడు. మొదటగా ఈ సినిమా పూర్తి నిర్మాణ బాధ్యత తన వల్ల కాదనుకున్న చరణ్ నిర్మాణ భాగస్వామిగా నిరంజన్ రెడ్డిని తీసుకోవడం జరిగింది.
ఆయన నిర్మాణంలో ఇప్పటికే ఖైదీ నెం.150 మరియు సైరా సినిమాలు వచ్చాయి. ఈ సినిమా మూడవది అవ్వనుంది. అయితే ఆర్‌ఆర్‌ఆర్ సినిమాలో నటించడంతో పాటు సైరాతో వచ్చిన నష్టాల కారణంగా చరణ్ ఆచార్య సినిమా నిర్మాణంలో భాగస్వామ్యం అయ్యేందుకు ఆసక్తిగా లేడు అంటూ ప్రచారం జరుగుతోంది.
ప్రస్తుతం సినిమా నిర్మాణంలో ప్రస్తుతం కేవలం నిరంజన్ రెడ్డి మాత్రమే ఉన్నాడు. చరణ్ పూర్తిగా తప్పుకున్నట్లే అంటూ వార్తలు వస్తున్నాయి. సైరా ఇచ్చిన షాక్ తో రామ్ చరణ్ మరో ప్రయోగానికి ప్రయత్నించడం లేదు అంటున్నారు. ప్రస్తుతం ఆచార్య సినిమాకు సంబంధించిన బిజినెస్ వ్యవహారాలు చర్చ జరుగుతున్నాయట. వాటిని పూర్తిగా నిరంజన్ రెడ్డి చూసుకుంటున్నాడట. సినిమా సక్సెస్ అయితే లాభాల్లో 10 శాతం వరకు వాటా వచ్చే అవకాశం ఉందని అంటున్నారు.
ఇక చిరంజీవి మరియు రామ్ చరణ్ లు విడి విడిగా పారితోషికాలు తీసుకోబోతున్నారు. దానికి తోడు పది శాతం లాభాల్లో వాట. ఎలాంటి పెట్టుబడి లేకుండా ఈ సినిమాతో ఇద్దరు కలిసి దాదాపుగా 40 నుండి 50 కోట్ల వరకు తీసుకుంటున్నట్లుగా తెలుస్తోంది.