కరోనా భయంతో ఇన్నాళ్లు షూటింగ్స్‌కు హాజరు కాని వారు ఇప్పుడు కెమెరా ముందుకు వచ్చేందుకు సిద్దం అవుతున్నారు. ముఖ్యంగా టాలీవుడ్ హీరోలు ఇన్ని రోజులు పూర్తిగా ఇంటికే పరిమితం అయ్యారు. అయితే ఇంకా ఎంత కాలం ఇంట్లో ఉంటామనుకున్న హీరోలు ఏది అయితే అదే అయ్యింది అన్నట్లుగా షూటింగ్‌కు హాజరు అయ్యారు. ఈ విషయంలో వారు తీసుకున్న నిర్ణయాన్ని సినీ కార్మికులు అభినందిస్తున్నారు.
ఈ నెల నుండి పూర్తిగా కాకున్న కనీసం 40 నుండి 50 శాతం షూటింగ్స్ అయినా జరుగుతాయని విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. జూన్ నెలలో షూటింగ్స్‌కు అనుమతి వచ్చినా కూడా ఇప్పటి వరకు ప్రారంభం అయిన సినిమాలు చేతి వెళ్ల మీద లెక్కించవచ్చు. ముఖ్యంగా స్టార్ హీరోలు ఎవరు కూడా ముందుకు రాలేక పోయారు.
కుటుంబ పరిస్థతులు మరియు ఇతర్రత కారణాలతో షూటింగ్స్ ను వాయిదా వేస్తూ వచ్చారు. థియేటర్లు ఎలాగూ లేవు సినిమాలు విడుదలకు ఛాన్స్ లేదు. కనుక షూటింగ్స్ చేసినా ఏం ప్రయోజనం అనుకుని నిర్మాతలు కూడా చల్లగానే ఉన్నారు. ఇప్పుడు ఓటీటీ రిలీజ్‌కు కూడా అవకాశం ఉందనే ఉద్దేశ్యంతో తమ సినిమాలను ఫినీష్ చేసేందుకు నిర్మాతలు ప్రయత్నాలు మొదలు పెట్టారు.
ఈ విషయంలో యంగ్ హీరోలు ముందుకు వచ్చారు. సందీప్ కిషన్, సాయి ధరమ్ తేజ్, నితిన్ వంటి యంగ్ స్టార్స్ ఈ నెలలో తమ సినిమాల షూటింగ్స్ కు హాజరు అయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇక మహేష్‌బాబు, ఎన్టీఆర్, చిరంజీవి, చరణ్, బన్నీ స్థాయి హీరోలు అక్టోబర్ లేదా నవంబర్ నుండి షూటింగ్స్ కు హాజరు అయ్యే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది.
మొత్తానికి టాలీవుడ్ హీరోలు కరోనా వ్యాక్సిన్ వచ్చేవరకు షూటింగ్స్ కు వెళ్లవద్దనుకున్నా కాస్త ధైర్యం చేసుకుని షూటింగ్స్‌కు ముందుకు రావడం నిజంగా అభినందనీయం అంటున్నారు.