మెగాస్టార్ చిరంజీవి 152వ సినిమా ఆచార్యకు కొరటాల శివ దర్శకత్వం వహిస్తుండగా రామ్ చరణ్ నిర్మస్తున్న విషయం తెల్సిందే. సినిమాకు సంబంధించిన షూటింగ్ పూర్తి అయ్యి ఈ నెలలో అంటే ఆగస్టులో ప్రేక్షకులముందుకు రావాల్సి ఉంది. కాని కరోనా కారణంగా సినిమాను వచ్చే ఏడాది వేసవికి వాయిదా వేశారు.
ఇటీవలే చిరంజీవి పుట్టిన రోజు సందర్బంగా ఆచార్య ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ ను విడుదల చేయడం జరిగింది. సినిమా విడుదల విషయంలో అప్పుడే క్లారిటీ ఇచ్చారు. సినిమా షూటింగ్ ను అక్టోబర్ లేదా నవంబర్ లో మొదలు పెట్టి మార్చి వరకు పూర్తి చేయాలని భావిస్తున్నారట. సినిమాను ఏ్రపిల్ 9న ప్రేక్షకుల ముందుకు తీసుకు రావాలని నిర్ణయించారు.
టాలీవుడ్ లో ఏప్రిల్ 9 కి మంచి సెంటిమెంట్ ఉంది. ఆ తేదీన వచ్చిన సినిమాలు మంచి విజయాన్ని సొంతం చేసుకున్నాయి. కనుక అదే రోజున ఆచార్యను విడుదల చేయాలని గట్టి నిర్ణయం తీసుకున్నారు. త్వరలోనే సినిమాకు సంబంధించిన షూటింగ్ తేదీని ప్రకటించే అవకాశం ఉంది.
ఇక ఆచార్య సినిమా షూటింగ్ లో కాజల్ అగర్వాల్ తో పాటు సీనియర్ నటీనటులు పాల్గొనాల్సి ఉంది. కనుక జాగ్రత్తలు ఎక్కువగా తీసుకుంటున్నారు. చిరంజీవి వయసు రీత్యా కాస్త ఆలస్యంగానే సినిమాను మొదలు పెట్టడం మంచిది అనే అభిప్రాయం వ్యక్తం అవుతుంది. ఈ సినిమాకు చరణ్ నిర్మాత అవ్వడంతో పాటు కీలక పాత్రలో నటించబోతున్నాడు. కనుక సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకేలా వస్తున్నాయి.
సినిమా కొరటాల గత సినిమాల మాదిరిగా రికార్డుల వర్షం కురిపించడం ఖాయం అంటున్నారు. ఆచార్య సినిమా విడుదల తేదీని దాదాపు ఏడు నెలల ముందుగానే బ్లాక్ చేయడం జరిగింది. కనుక అనుకున్న సమయంలో ఖచ్చితంగా ఆచార్య వచ్చే అవకాశం ఉందంటున్నారు.