సుశాంత్ మృతి చెందినప్పటిన ఉండి కూడా రియాను టార్గెట్ చేసి చాలా మంది విమర్శలు చేస్తున్నారు. అప్పటి నుండి ఇప్పటి వరకు సోషల్ మీడియాలో సుశాంత్ పేరుతో ఆయన అభిమానులు మరియు మద్దతు దారులు ట్రెండ్ చేస్తునే ఉన్నారు. నేడు కూడా రియాను ఇంటర్వ్యూ చేసినందుకు గాను ఆజ్‌తక్ ఛానెల్ పై సుశాంత్ అభిమానులు తీవ్ర స్థాయిలో ట్రోల్స్ చేస్తున్నారు.
ఆ ఇంటర్వ్యూ తర్వాత రియాకు కూడా మద్దతు పెరిగింది. ఇన్ని రోజులు సోషల్ మీడియాలో సుశాంత్ కు మద్దతుగా మాట్లాడేవారిని ఆమెను ట్రోల్స్ చేసే వారిని మాత్రమే చూశాం. కాని నేడు రియాకు మద్దతుగా జస్టీస్ ఫర్ రియా అంటూ ఒక హ్యాష్ ట్యాగ్ ను క్రియేట్ చేశారు. ఆ హ్యాష్ ట్యాగ్ కు అనూహ్య రెస్పాన్స్ దక్కింది. ఆ హ్యాష్ ట్యాగ్ తో చాలా మంది చేసిన ట్వీట్స్ జాతీయ స్థాయిలో ట్రెండ్ అయ్యాయి.
ఈ విషయంలో రియా కాస్త ఊపిరి పీల్చుకోవచ్చు. ఆమె చాలా రోజులుగా ఎదుర్కొంటున్న వ్యతిరేకతకు ఇది కాస్త ఊరట అనుకోవచ్చు. ఈ విషయాన్ని రామ్ గోపాల్ వర్మ కూడా ట్వీట్ చేశాడు. సోషల్ మీడియాలో రియాకు న్యాయం అనే హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ అవ్వడంపై ఆయన హర్షం వ్యక్తం చేశాడు.
ఆ ఇంటర్వ్యూ చూసిన తర్వాత చాలా మంది రియాకు మద్దతు తెలుపుతున్నట్లుగా ఉందని అంటున్నారు. రియాపై విమర్శలు చేయడం మానేసి కేసును సక్రమంగా వెళ్లే విధంగా చూడాలంటూ వర్మ పేర్కొన్నాడు. రియా మద్దతుదారులు పెరగడంతో ఇకపై సోషల్ మీడియాలో సుశాంత్ అభిమానులకు మరియు రియా అభిమానులకు మద్య రచ్చ రచ్చ జరగడం ఖాయం అనిపిస్తుంది.
ఈ వివాదం ముందు ముందు ఎక్కడకు వెళ్తుందా అంటూ అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మొత్తానికి అయితే రియా వైపు గాలి మళ్లడం జరిగింది. ఇది ఆమెకు శుభ పరిమాణం అంటున్నారు. ముందు ముందు ఎలా ఉంటుంది అనేది కాలమే నిర్ణయించాలి.