కరోనా కారణంగా ఈ ఏడాదిలో కేవలం రెండే రెండు పెద్ద సినిమాలు వచ్చాయి. అవి మహేష్ బాబు నటించిన సరి లేరు నీకెవ్వరు కాగా రెండవ సినిమా అల వైకుంఠపురంలో సినిమా. ఈ రెండు సినిమాలు కూడా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని సొంతం చేసుకున్నాయి. అయితే రెండు సినిమాల్లో పై చేయి మాత్రం అల వైకుంఠపురంలో సినిమా సాధించింది.
ఈ ఏడాదిలో టాప్ సినిమాగా నిలవడంతో పాటు నాన్ బాహుబలి రికార్డును కూడా సొంతం చేసుకుంది. ఇక పాటల పరంగా కూడా సరిలేరు నీకెవ్వరు సినిమాకు ఎక్కడ కూడా ఛాన్స్ ఇవ్వకుండా అల వైకుంఠపురంలో పాటలు రికార్డుల వర్షం కురిపించాయి. యూట్యూబ్ లో ఈ సినిమా సాధించిన రికార్డులు అన్నీ ఇన్నీ కావు.
ఇలాంటి సమయంలో మరో రికార్డును కూడా సరిలేరు నీకెవ్వరు కు లేకుండా అల వైకుంఠపురంలో సినిమా చేసింది. మహేష్ సినిమా సరిలేరుకు వచ్చిన రికార్డు టీఆర్పీ రేటింగ్‌ను ఇప్పుడు బన్నీ సినిమా కొల్లగొట్టింది. కేవలం మహేష్ బాబు సినిమానే కాకుండా ఇతర ఏ తెలుగు సినిమాలకు కూడా దక్కనంత రేటింగ్ ను దక్కించుకుంది. 30 రేటింగ్ తో బ్లాక్ బస్టర్ గా నిలిచింది.
ఈ విషయంలో కూడా అల్లు అర్జున్ మహేష్ బాబుపై పై చేయి సాధించాడు. బన్నీ కెరీర్‌లో ఇప్పటి వరకు ఒక్క ఇండస్ట్రీ హిట్ లేదు. కాని ఈసారి వచ్చిన హిట్ ఏకంగా సూపర్ స్టార్ కే దిమ్మ తిరిగేలా వచ్చింది అనడంలో ఎలాంటి సందేహం లేదు. అద్బుతమైన త్రివిక్రమ్ మార్క్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఆ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్ గా నటించింది.
సినిమాలోని పాటలు సినిమాకు ప్లస్ పాయింట్ అయ్యాయి అనడంలో సందేహం లేదు. వెండి తెరపై హిట్ మరియు బుల్లి తెరపై హిట్ అది కూడా ఆల్ టైం హిట్ ను దక్కించుకున్న మొదటి సినిమా ఇదే అయ్యి ఉంటుంది అంటూ ఫ్యాన్స్ గొప్పగా చెప్పుకుంటున్నారు.
ఈ సినిమాతో వచ్చిన బూస్ట్‌తో బన్నీ తన పుష్ప సినిమాకు మరింత సీరియస్ గా సిద్దం అయ్యే అవకాశం ఉంది. సుకుమార్ దర్శకత్వంలో పుష్ప సినిమా రూపొందుతున్న విషయం తెల్సిందే. త్వరలో ప్రారంభం అయ్యి వచ్చే ఏడాది పుష్ప ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది.