యాంకర్ ప్రదీప్ కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈయన బుల్లితెరపై మరియు వెండి తెరపై కూడా సందడి చేస్తున్నాడు. బుల్లితెర సూపర్ స్టార్ అంటూ అభిమానులు పిలుచుకునే ప్రదీప్ ఎప్పుడు ఏదో ఒక వివాదంలో ఇరుక్కుంటున్నాడు. ఇప్పుడు ఏకంగా రేప్ కేసులో ఇరుక్కున్నాడు. రేప్ కేసు ఎఫ్ఐఆర్ లో ఇతడి పేరు ఉండటంతో చర్చనీయాంశంగా మారింది. కొందరు మీడియాలో ఇష్టానుసారంగా రాసేస్తున్నారు.
పోలీసులు రేప్ కేసులో నిర్భయ కేసులో ప్రదీప్ ను అరెస్ట్ చేసినట్లుగా కథనాలు అల్లేస్తున్నారు. యూట్యూబ్ మరియు సోషల్ మీడియాలో తనపై వస్తున్న వార్తలతో కలత చెందిన ప్రదీప్ మీడియా ముందుకు వచ్చాడు. ఆ వార్తలు తనకు తీవ్ర మనో వేదనకు గురి చేశాయని అన్నాడు. ఇలాంటి వార్తలను గురించి రాయడం ఎంత వరకు నీతి అనిపించుకుంటుంది అంటూ మీడియాను ప్రదీప్ ప్రశ్నించాడు.
ఎవరో ఏదో మాట్లాడారు అనగానే అంతా దాన్ని గుడ్డిగా నమ్మేయడం ఎంత వరకు కరెక్ట్ అంటూ ప్రదీప్ ప్రశ్నించాడు. ఈ విషయంలో నిజా నిజాలు ముందు ముందు తెలుస్తాయి. ఖచ్చితంగా ఆ సమయంలో నేను నిర్దోషిని అని తెలుస్తుంది. అప్పుడు మీరు మళ్లీ న్యూస్ రాస్తారా, నా పోయిన పరువు, నా కుటుంబ మానసిక వేదన మీరు తీసుకు వస్తారా అంటూ ప్రదీప్ ఎమోషనల్ అయ్యాడు.
కుటుంబ సభ్యులు ఈ సమయంలో ఎంతగా ఇబ్బంది పడుతుంటారో అర్థం చేసుకోలేరా అంటూ అసహనం వ్యక్తం చేశాడు. తన గురించి మొదటి నుండి కూడా ఏదో ఒక బ్యాడ్ ప్రచారం చేయాలని కొందరు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. ఎందుకో తెలియదు కాని ప్రదీప్ విషయంలో నిజంగానే మొదటి నుండి తప్పుడు ఆరోపణలు న్యూస్ వస్తున్నాయి. కావాలని పుట్టిస్తున్నారా లేదంటే అవే ఆయనకు ఉన్న క్రేజ్ కారణంగా వస్తున్నాయా అనేది తెలియడం లేదు.
మొత్తానికి ఈసారి రేప్ కేసు ఆరోపణలు రావడం ఇది సీరియస్ విషయం అవ్వడంతో ఆ కేసుతో తనకు సంబంధం లేదు అనేందుకు నాని మీడియా ముందుకు వచ్చాడు. ఆ కేసు విషయంలో అతి త్వరలో తాను బయటకు వస్తాను అనే నమ్మకంను ప్రదీప్ పేర్కొన్నాడు.