కేజీఎఫ్ 2 సినిమా కోసం కేవలం కన్నడ తెలుగు ప్రేక్షకులు మాత్రమే కాకుండా దేశ వ్యాప్తంగా ఆ మాటకు వస్తే ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఇండియన్ సినీ ప్రేమికులు ఎదురు చూస్తున్నారు. కేజీఎఫ్ చిత్రం మొదటి పార్ట్ ఏ స్థాయి విజయాన్ని దక్కించుకుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అందుకే సినిమా గురించి ఎలాంటి అనుమానం లేకుండా కేజీఎఫ్ 2 గురించి ఎదురు చూస్తున్నారు.
ఇదే సమయంలో కేజీఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ మాట్లాడుతూ కేజీఎఫ్ మొదటి పార్ట్ కేవలం ట్రైలర్ మాత్రమే. పూర్తి సినిమా చూడాలంటే కేజీఎఫ్ 2 సినిమా వచ్చే వరకు వెయిట్ చేయాలంటూ పేర్కొన్నాడు. అప్పటి నుండి సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకాయి. రికార్డు స్థాయి వసూళ్లను దక్కించుకుని బాహుబలిని సైతం బీట్ చేస్తుందా అన్నంతగా కొందరు నమ్మకాలు పెట్టుకున్నారు.
బాహుబలి కాకున్నా బాలీవుడ్ సినిమాలను బీట్ చేయగల సత్తా కేజీఎఫ్ కు ఉందని అంటున్నారు. అంతా సాఫీగా సాగుతున్న సమయంలో అనూహ్యంగా ఈ సినిమాలో అధీరా పాత్ర పోషిస్తున్న సంజయ్ దత్‌కు క్యాన్సర్ అంటూ నిర్థారణ అయ్యింది. దాంతో సినిమా షూటింగ్ విషయంలో ఏమైనా ఇబ్బంది తలెత్తేనా, అసలు సినిమా వచ్చే ఏడాదిలో అయినా విడుదల అయ్యేనా అంటూ ఎవరికి తోచిన విదంగా వారు కామెంట్స్ చేస్తున్నారు.
ఈ షూటింగ్ ను ప్రశాంత్ నీల్ జరుపుతున్నాడు. ఇటీవలే సినిమా చిత్రీకరణలో ప్రకాష్ రాజ్ పాల్గొన్నాడు. మరి సంజయ్ దత్ పరిస్థితి ఏంటీ అంటూ కొందరు ప్రశ్నిస్తున్నారు. ఆ విషయంలో దర్శకుడు ప్రశాంత్ నీల్ స్పందించలేదు. కాని మాకు అందిన విశ్వసనీయ సమాచారం ప్రకారం సంజయ్ దత్ తో దాదాపుగా 90 శాతంకు పైగా షూటింగ్ పూర్తి అయ్యిందట.
ఆయన రెండు వారాల పాటు వస్తే మొత్తం పూర్తి అయ్యేది. కాని ఇప్పుడు మాత్రం ఆ పరిస్థతి లేదు. కనుక దర్శకుడు ప్రత్యామ్నాయం వెదికే అవకాశం ఉంది. డబ్బింగ్ వేరే వారితో చెప్పించడం కొన్ని సీన్స్ ను గ్రాఫిక్స్ లో మెయింటెన్ చేయడం చేస్తారేమో అంటున్నారు.