రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న ఆర్ఆర్ఆర్ సినిమా కరోనా కారణంగా నిలిచి పోయిన విషయం తెల్సిందే. లేదంటే ఇప్పటి వరకు సినిమా షూటింగ్ పూర్తి చేసి పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ ను మొదలు పెట్టేవారు. జనవరి లో సంక్రాంతికి విడుదల చేయాలని జక్కన్న అనుకున్నాడు. అయితే కరోనాతో సినిమా వచ్చే ఏడాది ద్వితీయార్థంకు మర్చడం జరిగింది.
ఇప్పుడు సినిమా గురించి ఆసక్తికర ప్రచారం ఒకటి జరుగుతోంది. దాని ప్రకారం సినిమా హీరోయిన్ ను మార్చి మళ్లీ కొత్త హీరోయిన్ తో రీ షూట్ కు ప్లాన్ చేస్తున్నాట. దీని వల్ల సినిమాకు మరో 50 కోట్ల వరకు బడ్జెట్ పెరుగుంది అనేది వార్తల సారాంశం.గత కొన్ని రోజులుగా మీడియాలో ప్రముఖంగా వస్తున్న ఈ వార్తలపై చిత్ర యూనిట్ సభ్యులు అధికారికంగా స్పందించేందుకు సిద్దంగా లేరు.
సినీ విశ్లేషకులు మాత్రం ఈ విషయంలో ఒక క్లారిటీ ఇచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. వారి మాట ప్రకారం సినిమా షూటింగ్ చాలా తక్కువ మాత్రమే ఉంది. ఈ సమయంలో షూటింగ్ ను మళ్లీ చేయడం అనేది సాధ్యం కాదు. ముఖ్యంగా హీరోయిన్స్ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోవడం కాని మార్చుకోవడం కాని జరగులేదు.
ఒక వేళ అలాంటిది చేయడం జరిగితే రాజమౌళి చాలా పెద్ద నిర్ణయం తీసుకున్నట్లగా భావించాల్సి ఉంటుంది. అదే నిజం అయితే 2022 వరకు సినిమా ప్రేక్షకులు ఎదురు చూడాల్సి ఉంటుంది. కనుక అప్పటి వరకు ఇది ఆగదు. ఇవన్నీ చూస్తుంటే సినిమాను అప్పటి వరకు వాయిదా వేయరు. అంటే హీరోయిన్ ను ఆలియా భట్ నే కంటిన్యూ చేసే అవకాశం ఉందంటున్నారు. ఇలాంటి విషయాలపై పుకార్లు రావడం కామన్ గా చూస్తున్నాం.
ఆర్ఆర్ఆర్ సినిమా విషయంలో ఇది ప్రచారం కావడంతో అంతా కూడా ఒకింత ఆసక్తి చూపిస్తున్నారు. సుశాంత్ మరణం కారణంగా ఆర్ఆర్ఆర్ సినిమా విషయంలో ఈ చర్చ జరుగుతోంది. సినిమా విడుదలకు ఇంకా ఎంత లేదన్న ఏడాది సమయం పడుతుంది. కనుక అప్పటి వరకు సుశాంత్ ఇష్యూ దాదాపుగా క్లోజ్ అవ్వడం ఖాయం. కనుక ఎలాంటి ఇబ్బంది లేదు.