టాలీవుడ్ కింగ్ నాగార్జున కెరీర్‌లో ఒడిదొడుకులు ఎదుర్కొంటున్నారు. ఈయన చాలా కాలంగా సక్సెస్ అనేది ఎరిగి లేడు. గత రెండు మూడు సంవత్సరాలుగా ఈయన చేస్తున్న సినిమాల విషయంలో ప్రేక్షకులు పెద్దగా ఆసక్తి కూడా చూపడం లేదు. ఆమద్య మన్మధుడు సినిమాపై కాస్త ఆసక్తి చూపించి ఎదురు చూసినప్పటికి సినిమా విడుదల తర్వాత నీరు గార్చారు.
నాగ్ సినిమాల విషయంలో బయ్యర్లు మరియు ప్రేక్షకులు అస్సలు ఆసక్తి చూపడం లేదు. తాజాగా వైల్డ్ డాగ్ విషయంలో కూడా అదే నిరూపితం అయ్యింది. సల్మాన్ దర్శకత్వంలో రూపొందుతున్న ప్రయోగాత్మక సినిమా వైల్డ్ డాగ్. ఆ సినిమా షూటింగ్ సగానికి పైగా పూర్తి అయ్యింది. సినిమాను పూర్తి చేసి ఓటీటీలో విడుదల చేయాలనుకుంటున్న మేకర్స్ కు షాక్ తగిలింది.
విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం వైల్డ్ డాగ్ సినిమాను కొనుగోలు చేసేందుకు ఏ ఒక్క ఓటీటీ సిద్దంగా లేదట. నిర్మాతలు స్వయంగా సంప్రదించేందుకు ప్రయత్నించగా అతి తక్కువ ధరకు అడుగుతున్నారట. దాంతో చేసేది లేక నిర్మాతలు ఓటీటీ విడుదలపై ఆశలు వదులుకున్నారట. సినిమాను దాదాపుగా పది కోట్ల బడ్జెట్ తో నిర్మిస్తున్నారు.
నాగ్ వంటి పెద్ద హీరోకు ఇది చాలా చిన్న బడ్జెట్, అయినా కూడా ఈ స్థాయిలో కూడా బిజినెస్ అవ్వడం లేదు అంటూ టాక్ వినిపిస్తుంది. ఈ సినిమాలో కమర్షిల్ ఎలిమెంట్స్ అస్సలు వుండవు. ఇక అన్ని సినిమాల్లో మాదిరిగా హీరో హీరోయిన్‌ల మద్య రొమాంటిక్ సన్నివేశాలు అస్సలు ఉండవు. కనుక ఈ సినిమా మాకు వద్దనే అభిప్రాయంను చాలా మంది వ్యక్తం చేస్తున్నారు.
నాగార్జున వైల్డ్ డాగ్ సినిమా థియేటర్ లలో విడుదల అయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఆ విషయంలో ఎలాంటి డౌట్ లేదు అంటున్నారు. నష్టమో లాభమో థియేటర్ లలో విడుదల చేయడం వల్ల కాస్త ఎక్కువ ప్రయోజనం ఉంటుందని అనుకుంటున్నారట. థియేటర్ లో విడుదలై సక్సెస్ అయతే అప్పుడు ఓటీటీ వారు క్యూ కట్టి నిలబడుతారు అంటున్నరు. మరి అది జరిగేనా లేదో తెలియదు.
ఈ సినిమాలో ఎన్‌ఐఏ ఏజెంట్ గా నాగార్జున కనిపించబోతున్నాడు. సినిమాకు సంబంధించిన షూటింగ్ ను అక్టోబర్ లేదా నవంబర్ నుండి ప్రారంభించే అవకాశం ఉందని అంటున్నారు. అందుకు సంబంధించిన ఏర్పాటు కూడా జరిగి పోతున్నాయి. భారీ అంచనాలు లేకున్నా వైల్డ్ డాగ్ థియేటర్లలో సక్సెస్ అవుతుందనే నమ్మకంను మేకర్స్ వ్యక్తం చేస్తున్నారు.