సీనియర్ హీరో వెంకటేష్ త్వరలో తన మ్యాజిక్ నెంబర్ 75వ చిత్రంను చేసేందుకు రెడీ అవుతున్నాడు. ప్రస్తుతం ఆయన చేస్తున్న ‘నారప్ప’ సినిమా ఆయన కెరీర్ లో 74వ సినిమాగా యూనిట్ సభ్యులు చెబుతున్నారు. ఇక 75వ సినిమాగా ఆయన మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో రూపొందబోతున్న చిత్రంలో చేసే అవకాశం ఉందని అంటున్నారు. అందుకు సంబంధించిన ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి. మల్లేశ్వరి చిత్రం సమయం నుండి వెంకటేష్, త్రివిక్రమ్ కాంబోలో మూవీ వచ్చే అవకాశం ఉంది అంటూ ప్రచారం జరుగుతోంది. అయితే త్రివిక్రమ్ మార్కెట్ అంతకు అంతకు పెరగడంతో వెంకీ మూవీ పక్కకు పెట్టడం జరిగింది.
ఈ సమయంలో వెంకీతో మూవీకి త్రివిక్రమ్ ఆసక్తిగా ఉన్నాడట. వెంకీకి తగ్గ ఒక మంచి కథను ఆయన రెడీ చేశాడని అంటున్నారు. ప్రస్తుతం నారప్ప సినిమాను చేస్తున్న వెంకీకి ఇప్పటికే త్రివిక్రమ్ స్క్రిప్ట్‌ను వినిపించారట. త్వరలోనే ప్రీ ప్రొడక్షన్ వర్క్ మొదలు పెట్టే అవకాశం ఉందంటున్నారు. సురేష్ బాబు మరియు రాధాకృష్ణ ఈ సినిమాను కాంబోగా నిర్మించబోతున్నారు. ప్రస్తుతం మాటల మాంత్రికుడు తన తదుపరి చిత్రం ను ఎన్టీఆర్‌తో చేసేందుకు సిద్దం అవుతున్నాడు. ఇప్పటికే ఆ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చింది. వచ్చే ఏడాదిలో పట్టాలెక్కించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఎన్టీఆర్‌తో మూవీ పూర్తి అయిన తర్వాత వెంకీ మూవీని పట్టాలెక్కించే అవకాశం ఉంది.
కామెడీ పాత్రలకు సినిమాలకు వెంకీ బాగా న్యాయం చేస్తాడు. అందుకే ఆయనతో ఒక మల్లీశ్వరి లాంటి సినిమాను మళ్లీ రీ క్రియేట్ చేయాలని త్రివిక్రమ్ భావిస్తున్నాడు. అందుకు సంబంధించిన ఏర్పాట్లు జరుగుతున్నాయి. వెంకీ మరో వైపు ఎఫ్ 3 చిత్రంలో కూడా నటించేందుకు రెడీ అయ్యాడు. ఈ సినిమాలు కాకుండా వెంకీతో ప్రముఖ దర్శకుడు క్రిష్ కూడా సినిమాను ప్లాన్ చేస్తున్నట్లుగా వార్తలు వచ్చాయి. కనుక ఖచ్చితంగా వెంకీ రాబోయే రెండు మూడు సంవత్సరాల్లో మంచి సినిమాలను ఇస్తాడని ఫ్యాన్స్ మరియు ప్రేక్షకులు నమ్మకంగా చెబుతున్నారు. వెంకీ మరికొంత కాలం హీరోగా చేసేందుకు ఆ సినిమాలు బూస్ట్ ను ఇస్తాయని విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.