బిగ్ బాస్ తెలుగు ఓటీటీ నాన్ స్టాల్ షో నుంచి మొదిటి వారమే ముమైత్ ఖాన్ ఎలిమినేట్ అయింది. ప్రేక్షకుల నుంతి అతి తక్కువ ఓట్లు రావడంతో షో నుంచి ఆమె ఎలిమినేట్ అయినట్లు హోస్ట్ నాగార్జున ప్రకటించారు. ఈ వారం నటరాజ్ మాస్టర్, అరియానా, హమీదా, ముమైత్ ఖాన్, మిత్రా శర్మ, ఆర్జే చైతూలు నామినేట్ అయ్యారు.
అయితే చివరకు ముమైత్ ఖాన్ ఎలిమినేట్ అయిపోయింది. అయితే షఓ నుంచి ఇంత త్వరగా బయటకు రావాల్సి వస్తుందని అస్సలే అనుకోలేదని ముమైత్ ఖాన్ వివరించింది. ఎలిమినేషన్ సమయంలో నవ్వుతూ కనిపించిన ఆమె స్టేజీపైకి రాగానే ఎమోషనల్ అయింది. తనకి అగ్రెసివ్ అంటూ ట్యాగ్ ఇచ్చారని తెగ బాధపడిపోయింది.
ఇక హౌజ్ లో విలువైన వ్యక్తులు, పనికి రాని వాళ్లు అనే ట్యాగ్ ఎవరికిస్తావని అడిగితే అఖిల్, అజయ్, తేజస్విని, అరియానా, అషురెడ్డిలు వర్తీ ట్యాగ్… సరయు, మిత్ర, శివ, బిందు, ఆర్జే చైతులకు వేస్ట్ ట్యాగ్ ఇస్తానని ముమైత్ తెలిపింది.