తెలుగు సినీ ఇండస్ట్రీలో చిరంజీవి, బాలకృష్ణల ఇమేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వీరిద్దరూ ఎంతో కష్టపడి స్టార్ హీరోల ఇమేజ్ ను దక్కించుకున్నారు. ఒకరికొకరు పోటాపోటీగా నిలుస్తూ… ఎన్నెన్నో మంచి సినిమాల్లో నటించారు. అటు చిరంజీవికి, ఇటు బాలకృష్ణకి లక్షల్లో ఫ్యాన్స్ ఉన్నారనే విషయం అందరికీ తెలిసిందే. అయితే ఈ ఇద్దరు హీరోలు నటించిన పలు సినిమాలు ఇప్పటి వరకు శాటిలైక్ హక్కులు అమ్ముడు పోలేదు. అయితే ఆ సినిమాలేంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
బాలకృష్ణ హీరోగా నటించిన పరనవీర చక్ర, అధినాయకుడు సినిమాలు ఇప్పటి వరకు టీవీల్లో ప్రసారం కాలేదు. ఇంత వరకు ఈ సినిమా శాటిలైట్ హక్కులు అమ్ముడు పోలేదు. బాలయ్య పరమవీర చక్ర విషయానికి వస్తే… దాసరి నారాయణ రావు 150వ సినిమాగా వచ్చిన ఈ చిత్రం ఇప్పటి వరకు టీవీలో ప్రసారం కాలేదు. అలాగే అధినాయకుడు సినిమాలో బాలయ్య బాబు మొదటి సారి త్రిపాత్రాభినయం చేశాడు.
ఈ చిత్రం శాటిలైట్ హక్కులు కూడా ఇప్పటి వరకు అమ్ముడు పోలేదు. అన్నంతలో అమెజాన్ ప్రైమ్ ఈ సినిమా డిజిటల్ హక్కులు కొనుక్కుంది. బాలయ్య కెరీర్ లో ఇంతకంటే దారుణం మరొకటి లేదని అభిమానులు ఇప్పటికీ తెగ ఫీల్ అయిపోతుంటారు. కానీ పరమ వీర చక్ర సినిమా హిందీలో డబ్ అయి యూట్యూబ్ లో రిలీజ్ అయింది.
ఇక చిరంజీవి అతిథి పాత్రలో నటించన కన్నడ సినిమా సిపాయిని తెలుగులోకి మేజర్ పేరుతో డబ్ చేశారు. ఈ చిత్రం విడుదలైన విషయం కూడా చాలా మందికి తెలియదు. అయితే ఈ సినిమా ఇప్పటి వరకు టీవీల్లో ప్రసారం కాలేదు. అయితే అట్టర్ ప్లాప్ సినిమాలు కావడంతోనే ఈ సినిమాలు శాటిలైట్ కాలేదని చెప్పొచ్చు. ఇక ముందైనా ఈ సినిమాలు టీవీల్లో వస్తే చూడాలనుకునే అభిమానులు కూడా ఉన్నారు.