పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా నటించిన భీమ్లా నాయక్ సినిమా పలువురు సింగర్ లు గుర్తింపు తెచ్చుకున్నారు. ఎక్కడో పల్లెల్లో ఉన్న వాళ్లలోని ప్రతిభను గుర్తించి సినిమాలో ఛాన్స్ ఇచ్చారు. ఇదే వారి పాలిట వరంగా మారింది. అయితే ఇందులో ముఖ్యంగా కిన్నెర మొగులయ్య, ఫోక్ సింగర్ దుర్గవ్వకు మంచి గుర్తింపు వచ్చింది. భీమ్లా నాయక్ టైటిల్ సాంగ్ లో తన గాత్రం కలిపిన మొగులయ్యకు ఇటీవలే పద్మశ్రీ వచ్చిన విషయం మన అందరికీ తెలిసిందే.
ఇక ఈ సినిమాలో అడవ తల్లి పాట పాడిన దుర్గవ్వ కూడా చిన్నపాటి సెలబ్రిటీ అయిపోయింది. ఇప్పటి వరకు ఎన్నో పల్లె పాటలు, జానపద గేయాలు పాడిన ఆమె మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలం రొయ్యలపల్లిలో ఉంటుంది. అయితే ఆమె తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తన జీవితంలో జరిగిన పలు విషయాల గురించి చెప్పి కన్నీరు పెట్టుకుంది.
పెళ్లయ్యాక ఐదేళ్లకే దుర్గవ్వ భర్తలను కోల్పోయిందట. తన కూతురు, కుమారుడిని ఎంతో కష్టపడి చదివించింది. కొన్నేళ్ల క్రితమే కూతురు పెళ్లి చేసిన కొడుకుతో కలిసి రొయ్యలపల్లిలో జీవిస్తోంది. ఎంతో కష్టపడ్డ తనకు ఈ సినిమాలో ఛాన్స్ రావడం ఎంతో సంతోషంగా ఉందని తెలిపింది. చిత్ర బృందానికి తన ప్రత్యేక ధన్యవాదాలను తెలిపింది. అయితే తాను మొదటగా సిరిసిల్లా సిన్నాది చీరలమ్మ ఒచ్చినాది అనే పాటను పాడిందట. ఆ తర్వాత ఉంగురం, సోగాల నెమిలా, పాటలను లైవ్ లో పాడి వినిపించింది.