ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న పవన్ కల్యాణ్ మూవీ భీమ్లా నాయక్. వకీల్ సాబ్ తర్వాత పవన్ సినిమా కావడంతో… ఫ్యాన్స్ కళ్లకు కాయలు కాసేలా ఎదురుచూస్తున్నారు. ఎప్పుడో విడుదల కావాల్సిన భీమ్లా నాయక్.. కరోనా కారణంగా వాయిదా పడుతూ వచ్చింది. ఎట్టకేలకు ఫిబ్రవరి 25న విడుదల కానుంది. భీమ్లా నాయక్ చిత్రానికి సాగర్ కే చంద్ర దర్శకత్వం వహించాడు. ఇందులో పవన్ కల్యాణ్ తో పాటు రానా దగ్గుబాటి నటిస్తున్నాడు. డైరెక్టర్ సాగర్ కే చంద్ర అయినప్పటికీ అంతా నడిపించింది మాత్రం త్రివిక్రమ్ శ్రీనివాసే. సంభాషణలు, కథలో మన నెగిటివిటీకి తగ్గట్లు మార్పులు చేయడం సహా అన్నింట్లో త్రివిక్రమ్ తమ మార్కు చూపించారని తెలుస్తోంది.
పవన్ సినిమా కావడం.. అందులోనూ రాజకీయాల్లోకి వెళ్లిన తర్వాత వకిల్ సాబ్ లాంటి హిట్ అందుకున్న తర్వాత వస్తున్న చిత్రం కావడంతో అభిమానులు ఎంతో ఎదురుచూస్తున్నారు భీమ్లా నాయక్. అంచనాలు మిస్ కాకూడదన్న ఉద్దేశంతో భీమ్లా నాయక్ నిర్మాతలు పృకూడా ప్రమోషన్స్ చేస్తూ జనాలకు మరింత చేరువ చేస్తున్నారు. ఇక సినిమా రేపు రిలీజ్ కాబోతున్న నేపథ్యంలో ఈ సినిమా ప్రీ రిలీజ్ కార్యక్రమాన్ని నిన్న గ్రాండ్ గా జరిపారు. హైదరాబాద్ యూసఫ్ గూడ పోలీసు మైదానంలో జరిగిన ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు ముఖ్య అతిథులుగా మంత్రులు కేటీఆర్, తలసాని శ్రీనివాస్ యాదవ్ హాజరు అయ్యారు.
భీమ్లా నాయక్ ప్రీ రిలీజ్ వేడుకలో అందరూ కనిపించారు కానీ త్రివిక్రమ్ శ్రీనివాస్ కనిపించలేదు. ఈ చిత్రానికి కర్త, కర్మ, క్రియ అయిన త్రివిక్రమ్…. ప్రీ రిలీజ్ ఈవెంట్ లో కనిపించకపోవడంతో రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ వేదికపై త్రివిక్రమ్ స్పీచ్ వినకపోవడంతో అక్కడికి విచ్చేసిన వారికీ ఒక డిసాప్పాయింట్మెంట్ ఉండి పోయిందనే చెప్పాలి. అయితే.. ప్రీ రిలీజ్ ఈవెంట్ కు కేటీఆర్ ను స్వయంగా త్రివిక్రమ్ శ్రీనివాసే ఆహ్వానించినట్టు తెలుస్తోంది.
అయితే త్రివిక్రమ్ ఆహ్వానించి కేటీఆర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు హాజరు అయ్యారు కానీ గురువు గారు మాత్రం కనిపించినా సందడి మాత్రం చేయలేదు. అయితే త్రివిక్రమ్ సైలెన్స్ వెనక వేరే రీజన్ ఉందని గుస గుస వినిపిస్తోంది. బండ్ల గణేష్ తో వివాదం కారణంగానే త్రివిక్రమ్ కార్యక్రమంలో సైలెంట్ గా ఉన్నారని అంటున్నారు. ఒక వేళ త్రివిక్రమ్ మాట్లాడితే… బండ్లన్నన బండ్లన్న అనే అరుపులు వినిపించేవని… దీని వల్ల వారి మధ్య నెలకొన్న వివాదం మరింత ముదిరే ఛాన్సు ఉందని.. అది అందరికీ తెలిసే అవకాశం ఉండటంతోనే కార్యక్రమంలో త్రివిక్రముడు సైలెంట్ గా ఉన్నట్లు తెలుస్తోంది. అసలు బండ్ల గణేష్ కు, త్రివిక్రమ్ శ్రీనివాస్ కు మధ్యలో ఏం జరిగిందని చాలా మంది గుస గుస పెడుతున్నారు. వారిద్దరి మధ్య భూములకు సంబంధించిన తగాదాలు ఉన్నాయని టాక్ వినిపిస్తోంది. ఇలా రక రకాల కారణాలు వారిద్దరి మధ్య ఉన్నాయని అనుకుంటున్నారు. ప్రతి ఒక్కరిని మాట్లాడాలంటూ ఒత్తిడి చేసే యాంకర్ సుమ కూడా త్రివిక్రమ్ శ్రీనివాస్ ను మాట్లాడాలని ఒత్తిడి చేయలేదని తెలుస్తోంది.