వైసీపీతో కలిసి త్రివిక్రమ్ ఏదో ప్లాన్ చేశారని, తనను భీమ్లా నాయక్ ప్రీ రిలీజ్ వేడుకలకు అందుకే రానివ్వడం లేదంటూ బండ్ల గణేష్ మాట్లాడిన ఓ ఫోన్ కాల్ రికార్గింగ్ లీక్ అయింది. అయితే అందులో నిజం ఎంత ఉంది, ఏంటి అనేది మాత్రం తెలియట్లేదు.
జనసేన అధినేత పవన్ కల్యాణ్, ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మధ్య రాజకీయ పరంగా పోటీ ఉన్న విషయం అందరికీ తెలిసిందే. అయితే అధికార పార్టీ వైఫల్యాలను ప్రజలకు దగ్గర చేస్తూ.. తమ పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు చాలా కష్టపడుతున్నారు హీరో పవన్ కల్యాణ్. అయితే ఈ క్రమంలోనే వైసీపీతో కలిసి డైరెక్టర్ త్రివిక్రమ్ ఏదో ప్లాన్ చేశారని.. అందుకే తనను భీమ్లా నాయక్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు రానివ్వట్లేదంటూ బండ్ల గణేష్ మాట్లాడిగి ఓ ఫోన్ కాల్ రికార్గింగ్ లీకైంది.
పవన్ కల్యాణ్ వీరాభిమాని అయిన బండ్ల గణేష్ గత సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లలో ఇచ్చిన స్పీచ్ లు తెగ వైరల్ అయ్యాయి. ఆయన మాట్లాడే మాటలు పవన్ అభిమానులకు తెగ ఇష్టం. అయితే భీమ్లా నాయక్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఆయన ఏం మాట్లాడుతాడా ప్రేక్షకులంతా తెగ వేచి చూస్తున్నారు. అయితే తనకు మాత్రం ఇందుకు సంబంధించి ఎలాంటి ఆహ్వానం రాలేదంటూ బండ్ల గణేష్ చెబుతున్నారు.
ఇదిలా ఉండగా… నేను స్పీచ్ రెడీ చేశా. కానీ వాళ్లు నన్ను భీమ్లా నాయక్ ఈవెంట్ కు పిలవలేదు. త్రివిక్రమ్ రావొద్దని చెప్పాడు. వాడు డౌన్ అవుతానని. అదే ఆలోచిస్తున్నాను. నాకు వెళ్లాలని ఉంది. మంచి డైలాగ్స్ కూడా రాసుకున్నాను. ైసీపీ వాళ్లతో త్రివిక్రమ్ ప్లాన్ చేసుకున్నారట. అంటూ బండ్ల గణేష్ ఓ వ్యక్తితో మాట్లాడిన ఫోన్ కాల్ లీకైంది. అయితే నువ్ లేకపోతే మేం చాలా మిస్ అవుతాం అన్నా అని ఫోన్ చేసిన వ్యక్తి అంటే అందరూ బండ్ల అన్న ఎక్కడ అని అరవండి.. నేను వెంటనే వచ్చేస్తా అంటూ బండ్ల గణేష్ తెలిపారు. అయితే ఇది నిజమో కాదో మాత్రం ఎవరికీ తెలియదు.