బిగ్ బాస్ అభిమానులకు శుభవార్త అందించారు ఆ షో టీం వాళ్లు. బిగ్ బాస్ నాన్ స్టాప్ ఎంటర్ టైన్ మెంట్.. అంటూ రాబోతున్న సీజన్-6 ఈ నెల 26వ తేదీ నుంచి ప్రారంభం కాబోతున్న విషయం మన అందరికీ తెలిసిందే. అయితే ఓటీటీ సీజన్ కాబట్టి ఇకపై బిగ్ బాస్ ఇంటి సభ్యులంతా 2 గంటలపాటు కెమెరా కంట్లోనే ఉంటారు. అయితే ఇందుకు సంబంధించిన ప్రోమోను కూడా విడుదల చేసేశారు ఈ కార్యక్రమ నిర్వాహకులు. అయితే ఈ సీజన్ లో ఎవరెవురు పాల్గొంటారనే విషయం మాత్రం ఇంకా తెలియలేదు.
బిగ్ బాస్ ఓటీటీ సీజన్ లో పాల్గొనబోయేది వీరేనంటూ ఇప్పటికే చాలా పేర్లు బయటకు వచ్చాయి. అయితే అందరికీ తెలిసిన వాళ్లే ఈ సీజన్ లో ఎక్కువగా ఉండబోతున్నారని.. తెలియని మొఖాలు తక్కువేనంటూ ఎవరికి తోచినట్లు వారు చెప్పేస్తున్నారు. అయితే బిగ్ బాస్ నిర్వాహకులు మాత్రం ఇంకా అఫీషయల్ గా ఎవరి పేర్లను బయటపెట్టలేరు. అయితే ఫిబ్రవరి 26వ తేదీ నుంచి ప్రారంభం కాబోతున్న ఈ షో… ఏ సమయంలో వస్తుందో ప్రోమో ద్వారా వెల్లడించారు.
అయితే ఇటీవలే విడుదల చేసిన ఈ ప్రోమోలో… ఓటీటీ సీజన్ ని చాలా గ్రాండ్ గా ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. అంతే కాదండోయ్ బిగ్ బాస్ హౌస్ సెట్ కూడా సరికొత్తగా ఉంది. ఇక ఆటాపాటా ప్రదర్శనలకు కొదవే లేకుడా ప్లాన్ చేస్తున్నారట. అలాగే ఈసారి 18 మంది కంటెస్టెంట్లను రంగంలోకి దించుతున్నట్లు చెబుతున్నారు. అయితే ఈ 18 మంది కంటెస్టెంట్లు ఎవరో తెలుసుకోవాలంటే మాత్రం ఇంకో వారం రోజులు ఆగాల్సిందే.