టాలీవుడ్ మొత్తం హైదరాబాద్ కు మకాం మార్డంతో… ఏపీ సినిమా సెలబ్రిటీలకు చాలా దూరం అవుతోంది. చిత్ర సీమ అంతా భాగ్య నగరం చుట్టూనే పరుగులు పెడుతోంది. అక్కడే పెద్ద పెద్ద స్టూడియోలు ఉండటంతో… ఏపీ వైపు ఎవరూ చూడట్లేదు. చాలా తక్కువ సినిమాలు మాత్రమే ఏపీలో నిర్మిస్తున్నారు. మహా అయితే విశాఖ పట్నం వెళ్తున్నారు. బీచ్, పల్లెటూరి అందాల కోసం అయితే ఉభయ గోదావరి జిల్లాల చుట్టూ ఓ పది, పదిహేను రోజుల ట్రిప్ వేస్తున్నారు. అవి కూడా చాలా తక్కువగా.
పెద్ద పెద్ద సినిమాలు ఏవీ కూడా ఏపీలో షూటింగ్ చేసిన దాఖలాలు లేవు. దీనిపై ఏపీ ప్రభుత్వం దృష్టి పెట్టింది. అక్కడ కూడా షూటింగ్ చేయాల్సిందేనంటూ ఏపీ సీఎం జగన్ పట్టు బడుతున్నారు. నిర్మాతలకు షరతులను కూడా విధిస్తున్నారు. అంతే కాదండోయ్.. అక్కడ సినిమాలు నిర్మిస్తే… సబ్సిడీలు కూడా ఇస్తామని ప్రకటించింది.
సగం సినిమాను ఏపీలో చేయాలని… అలాంటి సినిమాలకే సబ్సిడీలు, వ ఆటకు అనుమతులూ, టికెట్ల ధర పెంపు విషయంలో మినహాయింపులు ఉంటాయని చెప్పినట్లు తెలుస్తోంది. ఏయితే కనీసం శాతం షూటింగ్ అయినా ఆంధ్ర ప్రదేశ్ లోనే జరపాలని వివరించినట్లు… లేని పక్షంలో పరాయి రాష్ట్రాల నుంచి వచ్చిన సినిమాలనే చూస్తామని ముఖ్యమంత్రి జగన్ అన్నట్లు వార్తలు వస్తున్నాయి.
ఈ ఆఫర్స్ గురించి తెలుసుకున్న నిర్మాతలంతా.. ఏపీలో సినిమాలు చేసేందుకు ఓకే అని చెప్తున్నారంట. ఇందుకు సీఎం జగన్ ఎంతో సంతోషంగా ఫీల్ అయ్యారట. అయితే ఇప్పటికే పెద్ద పెద్ద హీరోలు, నిర్మాతలు ఏపీలో స్డూడియోలు నిర్మించేందు కోసం స్థలాల కూడా చూస్తున్నారట. ఇప్పుడు వాళ్లందరికీ స్థలాల కోసం అనుమతులు ఇచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి.