ఏపీ ముఖ్యమంత్రి సీఎం జగన్ మోహన్ రెడ్డిని ఇటీవలే మెగాస్టార్ చిరంజీవి, టాలీవుడ్ ప్రముఖులు కలిసిన విషయం మన అందరికీ తెలిసిందే. అయితే మా అధ్యక్షుడు అయిన మంచు విష్ణు కానీ… ఇండస్ట్రీలో పెద్ద మనిషిగా చలామణి అవుతున్న సినీ నటుడు మోహన్ బాబు కానీ ఇందులో లేకపోవడం గమనార్హం.
అయితే తాజాగా మంత్రి పేర్ని హైదరబాద్ లో సినీ నటుడు మంచు మోహన్ బాబును కలిశారు. రాష్ట్రంలో సినిమా టిక్కెట్ ధరల పెంపు విషయంపై ఆయనతో చర్చించారు. అయితే.. సినీ ఇండస్ట్రీలోని ఎవరైనా తనకు ఎలాంటి అభిప్రాయాలు చెప్పాలన్నా.. తనను కలవొచ్చని మంత్రి పేర్ని నాని వెల్లడించారు.
అంతే కాదండోయ్ కాంట్రవర్సీకి కేరాఫ్ అడ్రస్ అయిన డైరెక్టర్ రాం గోపాల్ వర్మను తన కార్యాలయానికి పిలుపించుకొని మరీ మాట్లాడారు. అలాగే అంతకు ముందు రోజు తమ్మారెడ్డి భరద్వాజకు కూడా… ఏవానా సలహాలు, సూచనలు ఇవ్వాలనుకుంటే నేరుగా తనను కలవొచ్ని చెప్పారు. కానీ మంత్రి పేర్ని నాని మోహన్ బాబు వద్దకు ప్రత్యేకంగా వచ్చి సినిమా టికెట్ల ధరలపై అభిప్రాయాలు తెలుసుగున్నారు.
అయితే అంతకు ముందు రోజు మంత్రి పేర్ని నాని.. చిరంజీవి బృందంతో పాటు మరి కొంత మంది సన్నిహితులైన అలీ, పోసాని కృష్ణ మురళి, నారాయణ మూర్తిలను తన ఆఫీసుకి పిలుపించుకొని మాట్లాడారట. ఈ విషయం తెలిసిన మంచు మోహన్ బాబు.. ఫీల్ అయ్యారట. అయితే ఈ విషయం తెలుసుకున్న మంత్రి పేర్ని నాని ఆ తర్వాత రోజు మోహన్ బాబుని కలిశారు.