ఆంధ్రప్రదేశ్‌లో గత కొంతకాలంగా కొనసాగుతున్న నేపథ్యంలో టాలీవుడ్ సినీ పరిశ్రమ పెద్దలు ముఖ్య మంత్రి జగన్ మోహన్ రెడ్డితో సమావేశమయ్యారు. అయితే ఈ భేటీ తర్వాత టికెట్ల వ్యవహారం సహా పలు సమస్యలపై భేటీలో చర్చించారు. అదనపు షోలు వేసుకోవడంపైనా సీఎంతో సమావేశంలో చర్చించారు. ఈ భేటీతో అయినా టాలీవుడ్ సమస్యలకు పరిష్కారం దొరుకుతుందా.. ఫిల్మ్ ఇండస్ట్రీ ఇబ్బందులను జగన్ ఎలా పరిష్కరిస్తారు.
టికెట్ల రేట్లను పెంచేందుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇస్తుందా.. రాయితీలు, అదనపు షోలు ఇలా అన్నింటికీ ఇరు వర్గాలకు ఇష్టమైన రీతిలో జవాబు దొరుకుతుందా లాంటి అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అయితే… ఫిల్మ్ ఇండస్ట్రీ సమస్యలకు శుభం కార్డు పడుతుందని.. భేటీ తర్వాత మెగాస్టార్ చిరంజీవి మీడియాతో వెల్లడించారు. త్వరలోనే సమస్యలు అన్నింటికి పరిష్కారం వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
ఈ సమావేశంలో చిరంజీవితో పాటు మహేష్ బాబు, ప్రభాస్, రాజమౌళి, పోసాని, కొరటాల శివ, నటుడు అలీ, నారాయణ మూర్తి సీఎం జగన్‌తో భేటీ అయ్యారు. ఎక్కువ మందికి అపాయింట్‌మెంట్ ఇవ్వాలని సినీ పెద్దలు జగన్ ను కోరినట్లు తెలుస్తోంది కానీ కరోనా ప్రొటోకాల్ ప్రకారం తక్కువ మందే రావాలని మంత్రి పేర్ని నాని సూచించారు. మొత్తం 17 అంశాలను ముఖ్యమంత్రి జగన్ ముందు పెట్టారు.
ముఖ్యంగా జీవో నంబర్ 35 పూర్తిగా రద్దు చెయ్యాలన్నది సినిమా పెద్దల డిమాండ్. ఈ ఉత్తర్వుల్లో చెప్పిన ప్రకారం సినిమాలు ఆడించజం అనేది కష్టమని థియేటర్ల యజమానులు చెబుతున్నారు. భారీ బడ్జెట్ సినిమాలు, ప్యాన్ ఇండియా చిత్రాలతో తెలుగు ఇండస్ట్రీ దేశానికే కేరాఫ్‌గా మార్చిన నిర్మాతలకూ ఈ రేట్లతో పెద్దగా లాభం లేదంటూ చెబుతున్నారు టాలీవుడ్ పెద్దలు.