థమన్.. ప్రస్తుతం తన పాటలతో షేక్ చేస్తున్నారు. ఈ మధ్య థమన్ తీసిన చిత్రాల్లోని పాటలు కనీసం ఒక్కటైనా సూపర్ హిట్ అందుకుంటోంది. రీసెంట్ గా వచ్చిన అఖండ మూవీకి థమన్ ఇచ్చిన సంగీతానికి విపరీతమైన పాజిటివ్ కామెంట్స్ వచ్చాయి. అఖండ మూవీ మ్యూజిక్ అదిరిపోయిందని చాలా మంది అన్నారు. బీజీఎం కేక అని.. అఖండ మూవీ సూపర్ హిట్ కావడంలో థమన్ సంగీతానిదే ముఖ్య పాత్ర అని అందరూ అంటారు.
అయితే థమన్ కాపీ క్యాట్ అని పలువురు విమర్శలు చేస్తూ ఉంటారు. పాత మూవీస్ నుంచి సంగీతాన్ని కాపీ చేసి కొద్దిగా వేరే డ్రమ్స్ వాడతారని అంటారు. యూట్యూబ్ థమన్ కాపీ క్యాట్ అంటూ ఒరిజినల్‌ను జత చేస్తూ చేసిన వీడియోస్ చాలానే ఉంటాయి. తాజాగా అలాంటి ఆరోపణే ఎదుర్కొంటున్నారు థమన్. అయితే ఇప్పుడు సాధారణ ప్రజల నుంచి కాకుండా ఏకంగా ఓ మ్యూజిక్ డైరెక్టర్ నుంచి కావడం విశేషం. ఆయన ఎవరో కాదు అయ్యప్పనుమ్ కోషియుంకు సంగీత దర్శకుడిగా పనిచేసిన జేక్స్ నుంచి.
తాజాగా పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటించిన బీమ్లా నాయక్ సినిమాకి థమన్ సంగీతం అందించిన విషయం తెలిసిందే. అయితే ఈ మూవీ మలయాళం చిత్రం అయిన అయ్యప్పనుమ్ కోషియుంకు రీమేక్ గా వస్తోంది. ఒరిజినల్ మలయాళం వర్షన్‌కి జేక్స్ బిజాయ్ మ్యూజిక్ అందించారు. భీమ్లా నాయక్ సినిమా రీమేక్ కాబట్టి.. ఒరిజినల్ మూవీ నుంచి మ్యూజిక్ ను తీసుకుని పవన్ మూవీలో అలాగే వాడేశారు.
అయితే జేక్స్ బిజాయ్‌కి తెలుగులో క్రెడిట్ ఇవ్వలేదు. తన ట్యూన్స్ వాడుకుంటున్నా… తనకు ఏమాత్రం క్రెడిట్ ఇవ్వకపోవడంపై జేక్స్ బిజాయ్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఇండియన్ పర్ఫార్మింగ్ రైట్ సొసైటీ లిమిటెడ్‌లో కాపీ రైట్స్ ఇష్యూ చేశారు జేక్స్ బిజాయ్.