అక్కినేని నాగార్జున మేనల్లుడు, హీరో సుమంత్ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే సుమంత్ తన మేనమాన నాగర్జునతో కలిసి ఓ సినిమా చేశారు. అయితే ఆ సినిమా చేసి తాను పెద్ద తప్పు చేశానంటూ ఆయన కామెంట్లు చేశాడు. మామతో కలిసి నటించడం తప్పెలా అయింది? అతనెందుకు అంతలా ఫీలవుతున్నాడో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
అక్కినేని నాగార్జున, సుమంత్ హీరోలుగా బాలశేఖరన్ దర్శకత్వంలో తరకెక్కిన సినిమా స్నేహమంటే ఇదేరా. అయితే ఈ సినిమా ఆశించిన స్థాయిలో వసూళ్లను రాబట్టలేకపోయింది. ఇందులో హీరోయిన్ గా భూమిక నటించగా.. ప్రత్యూష కీలక పాత్రలో చేసింది. అయితే ఈ సినిమా చేతి తాను తప్పు చేశానని హీరో సుమంత్ తెలిపారు. నిర్మాతలకు కూడా ఈ సినిమా భారీ మొత్తంలో నష్టాలను మిగిల్చింది.
ప్రేమకథ సినిమాతో హీరోగా కెరియర్ ప్రారభించిన హీరో సుమంత్… పదుల సంఖ్యలోనే సినిమాలు చేశాడు. చాలా వరకు సినిమా కథలను తానే విని… మంచి కథ అయి, తనకు నచ్చితేనే ఆ సినిమా చేస్తాడు సుమంత్. అందుకే చాలా తక్కువ సినిమాల్లో హీరోగా చేశాడు. తాజాగా ఈ హీరో నటించిన మళ్లీ మొదలైంది సినిమా జీ5ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. మళ్లీ రావా సినిమా తర్వాత ఆ స్థాయి సక్సెస్ లేని సుమంత్ మరి ఈ సినిమాతోనైనా సక్సెస్ సాధిస్తారేమో చూడాలి.
రియల్ లైఫ్ లో మామా అల్లుళ్లు అయిన తమను స్నేహితులుగా చూపించడం వల్లే ఈ సినిమా ఫ్లాప్ అయిందని సుమంత్ కామెంట్లు చేశారు. ఈ సినిమా ఫ్లాప్ అవుతుందని తనకు ముందే తెలుసని చెప్పారు. షూటింగ్ సమయంలోనే ఈ సినిమా చేసి తప్పు చేశానని అనుకున్నానని ఆయన చెప్పుకొచ్చారు. అప్పటికే సినిమా కొంత భాగం షూటింగ్ పూర్తవ్వడం వల్ల తాను ఏం చేయలేకపోయానని సుమంత్ తెలిపారు. స్నేహమంటే ఇదేరా సినిమాలో నేను నాగార్జున మామను కొట్టే సీన్ ఉంటుందని.. ఆ సీన్ చేసే సమయంలో తాను చాలా బాధపడ్డానని వివరించారు.