దేశవ్యాప్తంగా ఉన్న అన్ని రాష్ట్రాల్లోకెల్లా తమిళనాడు రాజకీయాలు చాలా ప్రత్యేకం ఇక్కడ సినిమా వాళ్లే ఎక్కువగా సీఎంలు కావడం గమనార్హం. కారణం తమిళులకు సినిమా సెలబ్రిటీలపై ఉండే క్రేజే. అయితే సినీ ఇండస్ట్రీకి చెందిన కరుణానిధి, ఎంజీఆర్ జయ లలితలు తమిళనాడు రాష్ట్రాన్ని పరిపాలించారు. అయితే విజయ్ కాంత్, కమల్ హాసన్ వంటి వాళ్లు కూడా సొంత పార్టీలు పెట్టి రాజకీయాల్లోకి వచ్చారు.
అయితే తమిళ్ సూపర్ స్టార్ రజినీకాంత్ కూడా రాజకీయాల్లోకి వచ్చనట్లే వచ్చి తాను.. పాలిటిక్స్ కి దూరం అంటూ చెప్పి తెలిపారు. తాజాగా స్టార్ హీరో విజయ్ కూడా రాజకీయాల్లోకి అుడుగుపెట్టాడు. ఈ మేరకు ఓ ప్రకటన జారీ చేసినట్లు సమాచారం.
తమిళనాడు రాష్ట్రంలో త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో హీరో విజయ్ తలపతి అభిమానులు స్వతంత్ర అభ్యర్థులుగా పోటీ చేస్తున్నారు. ఈ ఎన్నికల్లో పాల్గొనే వారంతా కమాండర్ విజయ్ పీపుల్స్ మూమెంట్ కింద పనిచేస్తున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయ్ పీపుల్స్ మూమెంట్ ఏ పార్టీతో ఎలాంటి పొత్తు లేదని ఓ ప్రకటన ద్వారా తెలియజేశారు. అయితే తన అభిమానులు స్తంత్ర అభ్యర్థులుగా పోటీ చేస్తున్న వారికి ప్రజు మద్దతు ఇవ్వాలని కోరాడు. వారి తరఫున ప్రచారాలు కూడా చేయాలన్నారు.
తన అభిమానుల కోసం విజయ్ అంతగా ఆలోచిస్తుంటే.. అతను కూడా రాజకీయాల్లోకి వస్తాడని అందరూ అనుకుంటున్నారు. అయితే అతను పొలిటికల్ ఎంట్రీ ఇస్తారా లేదా అని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మరి కొన్నాళ్లు అగితే తప్ప ఈ విషయం గురించి ఏం తెలిసేలా లేదు.