ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప సినిమా సాంగ్స్, డైలాగ్స్ తెగ వైరల్ అవుతున్నాయి. దేశ వ్యాప్తంగా ఎక్కడ చూసినా ఈ సినిమా గురించే చర్చ నడుస్తోంది. డిఫరెండ్ స్టైల్స్ లో ఈ సినిమాలోని పాటలకు డ్యాన్స్ చేస్తూ సోషల్ మీడియాలో పెడుతున్నారు చాలా మంది. చిన్న పిల్లల నుంచి పండు ముసలి వరకు తగ్గేదేలే అంటూ దూసుకుపోతున్నారు. అయితే ఈ సినిమాలోని శ్రీవల్లి పాట మాత్రం చాలా వైరల్ అయింది.
తాజాగా ఈ పాటను భజన రూపంలో పాడారు భజన మండలికి చెందిన వారు. ఆ సాంగ్ ఇంకా వైరల్ అవతూనే ఉంది. మరోవైపు యూపీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నాయకులు శ్రీవల్లీ పాట ట్యూన్ తో ఓ పాటను రూపొందించారు. ఎన్నికల్లో ఆ పాటనే వాడుతున్నారు. ప్రచారాలకు వెళ్లినప్పుడు ఆ పాటలతో హోరెత్తిస్తున్నారు. ప్రస్తుతం ఈ పాట తెగ వైరల్ అవుతోంది.
తు హే గజబ్ యూపీ.. తేరీ కసమ్ యూపా.. అంటూ సాగే ఈ పాటను శ్రీ వల్లి పాట ట్యూన్ లో కట్టారు. ఉత్తర ప్రదేశ్ వాసులం అయినందుకు చాలా గర్వంగా ఉంది అనే క్యాప్షన్ తో ఫిబ్రవరి 4న ఈ పాటను విడుదల చేశారు కాంగ్రెస్ నాయకులు. అయితే యూపీని ఈ పాటు ఓ ఊపు ఊపుతుంది. ఈ పాటను విన్న ప్రతీ ఒక్కరు తమకు తెలిసిన వాళ్లకు షేర్ చేస్తున్నారు.
శేషాచలం అడువల్లో ఎర్ర చందనం నేపథ్య కథతో తీసిన ఈ సినిమాలో బన్నీ.. స్మగ్లర్ గా కనిపించగా.. రష్మిక మందన్నా హీరోయిన్ గా నటిచింది. సుకుమార్ ఈ సినిమాకు దర్శకత్వం వహించగా… మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ ఈ సినిమాను నిర్మించింది. ‘పుష్ప’ రెండో భాగం షూటింగ్ త్వరలోనే మొదలుకానున్నట్లు సమాచారం. అయితే ఈ ఏడాది డిసెంబరులో ఈ సినిమాను థియేటర్లలోకి తీసుకురానున్నారు.