ఏపీలో అరాచక పాలన కొనసాగుతుందంటూ.. టీడీపీ రాజ్య సభ సభ్యుడు కనకమేడల రవీంద్ర కుమార్ ఆరోపించారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలనలో ప్రజలంతా తీవ్ర నిరాశ, నిస్పృహలతో ఉన్నారని తెలిపారు. విద్యార్థుల నుంచి సినిమా హీరోల వరకు ప్రభుత్వం తీరుపై నిరసన వ్యక్తం చేస్తున్నారని ఆయన వివరించారు. అంతే కాకుండా కేవలం పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమా భీమ్లా నాయక్ విడుదల కాబోతుందనే ఒకే కారణంతో టికెట్ల ధరలను తగ్గించారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ పవన్ కల్యాణ్ కు చాలా ఫేవర్ గా ఉందంటూ కామెంట్లు కనకమేడల కామెంట్లు చేశారు.
వైసీపీ ప్రభుత్వం రౌడీయిజం చేస్తూ.. ప్రజలను, విపక్షాలను భయభ్రాంతులకు గురి చేస్తుందంటూ కనకమేడల ఆరోపించారు. కావాలనే కక్ష పూరితంగా వ్యవహరిస్తూ… విపరీతమైన ఇబ్బందులకు గురిచేస్తున్నారని వాపోయారు. గతంలో టీడీపీ అధినేత చంద్రబాబు సతీమణిపై కూడా దారుణమైన వ్యాఖ్యలు చేశారని గుర్తు చేశారు. కొందరికి మాత్రమే ఫేవరేబుల్ గా ఉంటూ… ప్రజలను వైసీపీ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని కనకమేడల రవీంద్ర కుమార్ అన్నారు.
భీమ్లా నాయకు సినిమా విడుదల ఏపీలో టికెట్ల రేట్ల కారణంగా వాయిదా పడిన విషయం తెలిసిందే. అయితే ఈ నేపథ్యంలోనే సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి… పవన్ కల్యాణ్ సోదరుడు, మెగాస్టార్ చిరంజీవిని పర్సనల్ గా కలవడం మరింత అనుమానాలకు తావిస్తోంది. ఇదే విషయాన్ని ఎంపీ కనకమేడల రవీంద్ర కుమార్ పార్లమెంట్ లో ప్రస్తావించారు.