సీఎం జగన్ ఆహ్వానం మేరకు మెగాస్టార్ చిరంజీవి విజయవాడకు వెళ్లి… ముఖ్యమంత్రిని ఆయన కలిశారు. గంటన్నరపాటు ఏపీలో సినిమా టికెట్ల వివాదంపై చర్చించారు. సినీ పరిశ్రమ పెద్దగా కాకుండా పరిశ్రమ బిడ్డగా వెళ్లి ఏపీ సీఎం జగన్ ను కలిసినట్లు చిరంజీవి వెల్లడించారు. అయితే ఏపీ ప్రభుత్వం వారం, పది రోజుల్లో సినిమా టికెట్ల ధరలపై అందరికీ ఆమోద యోగ్యమైన నిర్ణయాన్ని వెలువరించే అవకాశం ఉందని తెలిపారు. సినిమా టికెట్ల ధరల పెంపు విషయంపై సీఎం జగన్ పునరాలోచిస్తారని చిరంజీవి ఆశాభావం వయక్తం చేశారు. అయితే సీఎం జగన్, మెగాస్టార్ చిరంజీవి పర్సనల్ మీట్ పై మంచు విష్ణు సెన్సేషనల్ కామెంట్స్ చేశారు.
తెలంగాణలో సినిమా టికెట్ల ధరలు పెంచితే.. ఏపీలో తగ్గించడం ఏమిటో అని ‘మా’ అధ్యక్షుడు మంచు విష్ణు అన్నారు. ధరల పెంపు విషయంపై సినీ పరిశ్రమ అంతా ఒక్కటై ప్రభుత్వంతో చర్చించాలన్నారు. ఈ విషయంపై తెలుగు ఫిలింఛాంబర్ ఆఫ్ కామర్స్ నిర్ణయం తీసుకుంటుందని మంచు విష్ణు వివరించారు. దాని నిర్ణయం మేరకే ‘మా’ ముందుకెళ్తుందన్నారు. అంతే కానీ తన వ్యక్తిగత నిర్మయాలతో పని లేదన్నారు. ఏపీలో సినిమా టికెట్ల ధరల పెంపుపై తనను ఎవరూ అభిప్రాయం అడగట్లేదని అన్నారు. వైఎస్ హయాంలోనే టికెట్ల ధరలపై జీవో వచ్చిందని.. ముందు దానిపై చర్చ జరిపించాలని అన్నారు.
అంతేకాని మా అధ్యక్షుడిగా తనపై విమర్శలు చేయడం సరి కాదన్నారు. అలా చేస్తే… తను మరింత పాపులర్ అవుతానని మంచు విష్ణు స్పష్టం చేశారు. అయిచే మెగాస్టార్ చిరంజీవి… సీఎం జగన్ తో పర్సనల్ మీటింగ్ కి వెళ్లిన వెంటనే.. మంచు విష్ణు ఇలాంటి వ్యాఖ్యలు చేయడం చూస్తుంటే… గొడవ మరింత ముదిరే అవకాశం ఉందని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.