సినిమా అంటేనే అదో రంగుల ప్రపంచం. అందులో ఉన్నవి లేనట్లు.. లేనివి ఉన్నట్లు చూపిస్తుంటారు. తెరపై కనిపించేదంతా నిజం అనుకుంటే.. చాలా కష్టం. అయితే హీరో, హీరోయిన్లు సినిమాలకు తగ్గుట్లుగా డైరెక్టర్లు మలుచుకుంటారనే విషయం మన అందరికీ తెలిసిందే. అలాగే వారు అందులో నటించాడినికి పడ్డ కష్టం మనకు ఏ మాత్రం కనిపించకుండా… ప్రేక్షకులను ఎంటర్ టైన్ మెంట్ చేయడమే వారి లక్ష్యం.
ముఖ్యంగా హీరోయిన్ల విషయంలో మాత్రం చాలా ఆటుపోట్లు ఉంటాయి. సక్సెస్ సాధించిన తర్వాతే వారు పడ్డ కష్టాల గురించి చెబుతుంటారు చాలా మంది హీరోయినట్లు. అందులో ఒఖరే గాలిపటం సినిమా హీరోయిన్ ఎరికా ఫెర్నాండెజ్. అయితే ఆమె తన కెరియర్ ప్రారంభంలో చాలా కష్టాలను ఎదుర్కోవాల్సి వచ్చిందట. ఇటీవలే జరిగిన ఓ ఇంటర్వ్యూలో ఆ విషయాల గురించి వెల్లడించిందా అమ్మడు. అవేంటో చూసేద్దాం ఇప్పుడు.
ఎరికా ఫెర్నాండెజ్ దక్షిణాది సినిమా ఇండస్ట్రీలో చాలా అవమానాలు ఎదుర్కొన్నట్లు తెలిపింది. అప్పట్లో దక్షిణాది సినిమాలో కాస్త బొద్దుగా ఉండే హీరోయిన్లను మాత్రమే తీసుకునే వారట. కానీ ఎరికా సన్నగా ఉండటంతో… ఆమె తెరపై లావుగా కనిపించాలని తన శరీరంపై ప్యాడ్స్ పెట్టి మేనేజ్ చేసే వాళ్ల చిత్ర యూనిట్ వాళ్లు. అయితే వారు అలా చేయడం తనకు అసలు ఇష్టముండేది కాదట. అసౌకర్యంగా, అవమానంగా ఫీల్ అయ్యేదట. దర్శక, నిర్మాతలు కోరుకున్నట్లు తాను లేనని చాలా ఏడ్చేదట. కానీ సినిమా మీద ఇష్టంతో ఈ కష్టాలన్నీ భరించినట్లు వివరించింది.
అయితే హీరోయిన్ ఎరికా ఫెర్నాండెజ్ 2010, 11సంవత్సరాల్లో వరుసగా పాంటలూన్స్ ఫెమినా మిస్ ఫ్రెష్ ఫేస్, పాంటలూన్స్ ఫెమినా మిస్ మహారాష్ట్రతో పాటు పలు టైటిళ్లను గెల్చుకుంది. మోడల్ గా కెరియర్ ప్రారంభించిన ఆమె బుల్లితెరపై కూడా కొన్నాళ్ల పాటు కనిపించింది. ఆ తర్వాత వెండితైరపై అడుగు పెట్టి తెలుగు, తమిళ, కన్నడ సినిమాల్లో నటించింది.