సామాజిక మాధ్యమాల్లో సెన్సేషన్ సృష్టించిన గద్వాల బిడ్డ ఆదివారం రోజు ఉదయం మృతి చెందాడు. తెలిసో తెలియకనో ఓ వర్గంపై అతను చేసిన వ్యాఖ్యలతో ఒక్క రోజు నైట్ లోనే సూపర్ స్టార్ అయ్యాడు. చిన్నప్పటి నుంచి ఆస్తమాతో బాధపడుతున్న ఆ గద్వాల బిడ్డ మల్లికార్జున్ రెడ్డి… ఆరోగ్యం క్షీణించి నిన్న మృతి చెందాడు.
ఈ విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు, బంధువులు, మీమర్స్, నెటిజెన్లు తీవ్ర విషాదానికి గురవుతున్నారు. అది కూడా నిజమే కదా సార్ అంటూ… మల్లికార్జున్ రెడ్డి చెప్పిన మాటలు గుర్తు తెచ్చుకుంటూ కన్నీటి పర్యంతమవుతున్నారు. ఆరోగ్యం సరిగ్గా లేకపోయినా… తనకిష్టమొచ్చినట్లు మాట్లాడుతూ ఎప్పుడూ నెటిజెన్లను ఆకట్టుకునేవాడు.
మల్లికార్జున్ రెడ్డి మాటలు వినని.. ఆయన వ్యాఖ్యలను వాడని మీమర్స్ లేరంటే అతిశయోక్తి కాదు. ఎంతో భవిష్యత్తు ఉన్న మల్లికార్జున్ రెడ్డి ఇంత చిన్న వయసులోనే ప్రాణాలు కోల్పోవడం చాలా బాధాకరం. మల్లికార్జున్ రెడ్డి మృతి వార్త తెలిసినప్పటి నుంచి సోషల్ మీడియాలో మొత్తం ఆయనకు సంబంధించిన పోస్టులే కనిపిస్తున్నాయి.
చిన్న పిల్లాడే అయిన మల్లికార్జున్ తనకు తెలిసో తెలియకనో ఓ వర్గంపై అనుచిత వ్యాఖ్యలు చేశాడు. ఆ వీడియో చాలా వైరల్ అయింది. కుల వివక్షకు సంబంధించిన మాటలు మాట్లాడారంటూ తీవ్ర స్థాయిలో కామెంట్లు రావడంతో.. ఆ వీడియోను డిలీట్ చేశారు. ఆ తర్వాత ఆ వర్గం వారు మల్లికార్జున్ పై పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. మందలించడానికి పోలీసులు పిలిస్తే వెళిలిన మల్లికార్జున్… అది కూడా కరక్టే కదా సార్ అంటూ చెప్పిన డైలాగ్ విపరీతంగా వైరల్ అయింది. అలా మల్లికార్జున్ సోషల్ మీడియా మిత్రులందరికీ పరిచయమయ్యాడు. కానీ ఇంత త్వరగా అతను చనిపోవడాన్ని ఎవరూ జీర్ణించుకోలేకపోతున్నారు.