బాలీవుడ్ స్టార్ అర్భజ్ ఖాన్, మలైకా అరోరాలు ఎయిర్ పోర్టులో కలిశారు. వారిద్దరూ కలిసి తమ కొడుకు అర్హాన్ నికి సెండాఫ్ ఇచ్చారు. అయితే గతంలోనే విడాకులు తీసుకున్న వీరిద్దరూ కలిసి ఉన్న ఫొటోలు బయటకు రావడంతో సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
బాలీవుడ్ స్టార్స్ ఏం చేసినా వార్తే అవుతుంది. వారి గురించి తెలుసుకునేందుకు అభఇమానులు ఎప్పుడూ రెడీగా ఉంటారు. వారు ఎక్కడ కనిపించినా ఫొటోలు తీస్తూ… ఆగం చేస్తుంటారు. అయితే అర్భజ్ ఖాన్, మలైకా అరోరా మధ్య జరిగిన ప్రతీ విషయం గురించి సోషల్ మీడియా వేదికగా చాలా చర్చ జరిగింది.
అయితే తమ కుమారుడికి సెండాఫ్ ఇచ్చేందుకు వెళ్లిన అర్భజ్ ఖాన్, మలైకా అరోరాలు కలిసి కాసేపు మాట్లాడుకున్నారంటూ ఓ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. భర్త నుంచి గతంలోనే విడాకులు తీసుకున్న వీరిద్దరూ మళ్లీ ఎందుకు కలిశారో… మళ్లీ విరిద్దరూ కలిసి పోతారా అంటూ నెటిజెన్లు కామెంట్లు చేస్తున్నారు.
కానీ మలైకా అరోరా హీరో అర్జన్ కపూర్ తో డేటింగ్ చేస్తూ… చాలా హాయిగా గడుపుతోంది. పబ్లిక్ గానే అతనితో పార్టీలు, పబ్ లకు వెళ్తోంది. ఎన్నో ట్రిప్పులు వేస్తోంది. అయితే వారిద్దరి బంధం చాలా బలమైనదని చాలా మంది అభిమానలు నమ్ముతున్నారు. అయితే ఇలాంటి సమయంలోనే మాజీ భర్తతో మలైకా అరోరా కలిసి మాట్లాడడంతో గుసగుసలు వినిపిస్తున్నాయి.
మలైకా అర్జన్ కపూర్ ని వదిలేసి.. మళ్లీ భర్త దగ్గరకు వచ్చేస్తుందేమో అనే అనుమానాలు రేకెత్తుతున్నాయి. కానీ వారిద్దరూ చాలా క్లోజ్ గా మాట్లాడుకోవడం అందరినీ ఆకట్టుకుంటోంది. అందుకే ఆ వీడియో అంతగా వైరల్ అవుతోంది.