ప్రముఖ గాయని భారత రత్న అవార్డు గ్రహీత లతా మంగేష్కర్ కన్ను మూశారు. 92 ఏళ్లు వయుసున్న ఆమె ముంబైలోని బ్రీచ్ కాండీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయారు. వెయ్యికి పైగా హిందీ సినిమాల్లో, 36 ప్రాంతీయ, విదేశీ భాషల్లో పాటలు పాడారు.
అంతేనా గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ లో చోటు సంపాదించారు. లతా మంగేష్కర్ మరాఠీ సంగీత కళాకారుడు దీననాథ్ మంగేష్కర్, శేవాంతిల పెద్ద కుమార్తె. 13 ఏల్ల వయసులోనే ఆమె తనే సింగింగ్ కెరియర్ ను ప్రారంభించింది. సుమారు 20 భాషల్లో కలిపి మొత్తం 50 వేలకు పైగా పాటలు పాడి శ్రోతలను ఉర్రూతలూగించారు.
అజీబ్ దస్తాన్ హై యే, ప్యార్ కియా తో డర్నా క్యా, మీలా అస్మాన్ సో గయా, తేరే లియే వంటి మహోన్నత పాటలుక ఆమె గాత్రాన్ని అందించారు. పద్మ భూషణ్, పద్మ విభూషణ్, దాదా సాహెబ్ ఫాల్కే, బహుళ జాతీయ చలన చిత్ర, అవార్డులతో సహా భారతదేశ పౌర పురస్కారమైన భారత రత్న అవార్డును కూడా సొంతం చేసుకున్నారు లతా మంగేష్కర్.
ఇండియన్ నైటింగేల్ గా పేరొందిన లతా మంగేష్కర్ 92 ఏళ్ల వయసులో అనారోగ్య సమస్యలతో ప్రాణాలను విడిచారు. తనను ఎంతగానో ప్రేమించే అభిమానుల గుండెల్లో ఎప్పటికీ కోల్కోలేని బాధను మిగిల్చారు.