ప్రముఖ గాయని లతా మంగేష్కర్ తుది శ్వాస విడిచారు. ముంబయిలోని బ్రీచ్ కాండీ ఆసుపత్రిలో శ్వాస సంబంధిత సమస్యలతో బాధపడుతూ ఈరోజు ఉదయం కన్నుమూశారు. వ92 ఏళ్ల లతా మంగేష్కర్ 30కి పైగా భారతీయ, విదేశీ భాషల్లో వేల వేల పాటలను పాడారు. అత్యధికంగా హిందీ, మరాఠఈ భాషల్లో పాటలను పాడారు గాయని లతా మంగేష్కర్.
అయితే గత నెల 11వ తేదీన కరోనా స్వల్ప లక్షణాలతో లతా మంగేష్కర్ ఆసుపత్రిలో చేరారు. వెంటిలేటర్ పై చికిత్స పొందారు. ఆ తర్వాత కొద్ది రోజులకే ఆమె ఆరోగ్యం బాగపడినట్లు ఆస్పత్రి సిబ్బంది, కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ క్రమంలోనే శినివారం లతా మంగేష్కర్ ఆరోగ్యం మరోసారి క్షీణించింది. మళ్లీ వెంటిలేటర్ పై ఉంచి వైద్యులు చికిత్సనందించారు. అయినప్పటికీ.. ఆమె ఆరోగ్యం క్షీణించి ఈరోజు ఉదయం ఆమె మృతి చెందింది.
అయిదో ఏటనే పాటల పాడటం ప్రారంభించిన ఆమెకు భారత ప్రభుత్వం నుంచి అత్యున్నత పరస్కారాలు లభించాయి. భారతీయ సంగీతానికి ఆమె అందించిన సేవలకు గాను 1969లో పద్మ భూషణ్ పురస్కారం లభించింది. 1999లో పద్మ విభూషణ్.. 2001లో భారత రత్న.. 1989లో దాదా సాహెబ్ ఫాల్కే అవార్డులను అందుకున్నారు సింగర్ లతా మంగేష్కర్. ఇవే కాకుండా ఫ్రాన్స్ ప్రభుత్వం ది లీజియన్ ఆఫ్ హానర్ పురస్కారాన్ని కూడా అందించింది.