ఈ మధ్య సోషల్ మీడియా చాలా మంది జీవితాలను మార్చేస్తోంది. ఎక్కడో, ఏవో పనులు చేసుకుంటే జీవితాలు గడిపే వారిని రాత్రికి రాత్రే ఫేమస్ చేసేస్తోంది. సింగర్ బేబమ్మ.. కనకవ్వ… ఇలా ఒక్కరేమిటి చాలా మందిని ఒకే ఒక్క పాట.. దేశమంతా గుర్తించేలా చేసింది. అయితే ప్రస్తుతం సోషల్ మీడియాను ఊపేస్తున్న పాట కచ్చా బాదం. అయితే ఈ పాట పాడిన వ్యక్తి ఎవరు? సినీ సెలబ్రిటీల నుంచి విదేశాల్లోని యువత వరకు ఈ పాటకు చిందులేయడం వెనుక కారణం ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
ఈ కచ్చా బాదం పాటను పల్లీలు అమ్ముకుంటూ జీవనం సాగించే ఓ వ్యక్తి పాడాడు. అతడిది పశ్చిమ బెంగాల్ లోని బీర్ భూమ్ జిల్లా లక్ష్మీ నారాయణపూర్ పంచాయతీలోని కురల్ జూరి గ్రామం. అయితే ఈ కచ్చా బాదం పాట పాడిన వ్యక్తి పేరు భుజన్. వాడి పడేసిన గిల్టు నగలు, చేతి గాజులకు పల్లీలు అమ్మేవాడు. ఇలా అమ్మేటప్పుడు కస్టమర్లను ఆకర్షించేందుకు భుజన్ పాటలు పాడేవాడు. ఇలా ప్రతిరోజూ పాడుతుండగా… అతనికో ఆలోచన వచ్చింది.
తన కొనే సామాన్ల పేర్ల పైనే ఓ పాట పాడితే బాగుంటుందనిపించింది. అనుకున్నదే తడవుగా పాట కట్టి పాడాడు. అలా ఊరూరా తిరిగి పాడుతుండగా… ఓ యూట్యూబర్ ఈయన పాటను సోషల్ మీడియాలో పెట్టాడు. అప్పటి నుంచి ఈ పాట తెగ వైరల్ అయిపోతుంది. అంతే కాదండోయ్..భుజన్ కూడా చాలా ఫేమస్ అయిపోయాడు.
చాలా మందికి ఈ పాటలోని లిరిక్స్ అర్థం కాకపోయినప్పటికీ… ఆ పాటు వినడానికి చాలా బాగుండటంతో… నెటిజన్లు ఫిదా అయిపోయారు. దాదాపు నెల రోజుల్లోనే ఈ పాటను ప్రపంచ వ్యాప్తంగా వైరల్ చేసేశారు. ఈ పాటు వైరల్ అవ్వడంతో.. భుజన్ కోసం అందరూ వెతకడం మొదలు పెట్టారు. పలువురు సింగర్స్ ఈ పాటను కొనుక్కోగా… మరి కొందరు తమ ఆల్బమ్స్ లో పాటులు పాడాలంటూ వీడియోలు తీసి పెట్టారు. చివరకు సింగర్ భుజన్ పట్టుకొని చాలా మంది సింగింగ్ ఛాన్స్ కూడా ఇచ్చారు. దీంతో అతడి జీవితమే మారిపోయింది. ఒక్క పాటు తన జీవితాన్ని మార్చడం.. తాను నమ్మలేకపోతున్నాని, ఏది ఏమైనప్పటికీ తనిప్పుడు చాలా సంతోషంగా ఉన్నానని తెలిపాడు.