అన్నమయ్య, శ్రీరామదాసు. ఓం నమో వెంకటేశాయా, శ్రీ మంజునాథ వంటి సినిమాలకు రచయితగా పని చేసిన జేకే భారవి గురించి చాలా మందికి తెలిసే ఉంటుంది. అయితే ఆయన కలం ఎన్నో భక్తి కథలకు ప్రాణ ప్రతిష్ట చేసింది. అలాగే ఒక్కో మెట్టు ఎక్కుతూ.. తాను కష్టపడి రాసిన కథలతో తనెంత సంపాదించాడో… అదంతా ఒక్క సినిమాతో నాశనం అయిందట. ప్రస్తుతం ఆయన ఆర్థికంగా చాలా ఇబ్బందులు పడుతున్నట్లు తెలిపారు జేకే భారవి.
ఇన్నాళ్లూ కార్లలో తిరిగిన ఆయన ప్రస్తుతం బైక్ కూడా కొనుక్కోలేని స్థితికి వచ్చారట. ఇంటర్వ్యూల కోసం బయటకు రావాలన్నా బైక్ బుక్ చేసుకుని వస్తున్నట్లు తెలిపారు. తను రాసిన కథలన్నీ సూపర్ డూపర్ హిట్ అయ్యి.. తనను ఒక స్థాయిలో నిలబెట్టినప్పటికీ… ఒక్క సినిమా మాత్రం ఆయన జీవితం మొత్తాన్ని మార్చేసిందట. మరి ఆయన లైఫ్ ని ఇంతగా నాశనం చేసిన ఆ సినిమా ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
జేకే భారవి ఎన్నో ఏళ్లుగా కష్టపడి సంపాదించినదంతా.. జగద్గురు ఆది శంకర సినిమాతో పోయిందట. తెలుగు, కన్నడ భాషల్లో ఈ సినిమాకు ఆయన స్క్రిప్టు రాశారట. కానీ కరోనా వల్ల డబ్బులు రావడం ఆలస్యమవుతోందట. తన ఆర్థిక పరిస్థితి పూర్తిగా కుదేలైపోయిందట.
తానడిగితే సాయం చేసేందుకు చాలా మంది ఉన్నారని.. ముఖ్యంగా ఒకే ఒక్క పోన్ చేస్తే.. నాగార్జు గారు తనకు డబ్బులిచ్చేందుకు రెడీగా ఉన్నారని తెలిపారు. అయినప్పటికీ.. ఒకరి దగ్గర చేయి చాచడం ఇష్టలేక తానెవరినీ సాయం చేయమని అడలేదని భారవి చెప్పారు.