ప్రధాని నరేంద్ర మోదీ తెలుగు సినిమాలపై ప్రశంసల జల్లు కురిపించారు. తెలుగు చిత్ర పరిశ్రమ ప్రపంచ వ్యాప్తంగా కీర్తి పొందిందని తెలిపారు. రంగారెడ్డి జిల్లా ముచ్చింతల్ లో 216 అడుగుల శ్రీరామానుజ విగ్రహాన్ని ఆవిష్కరించిన ఆయన.. తెలుగు గొప్పదనం గురించి మాట్లాడారు. తెలుగు సినిమా సిల్వర్ స్క్రీన్ పై అద్భుతాలు సృష్టిస్తుందంటూ కొనియాడారు.
సిల్వర్ స్క్రీన్ నుంచి ఓటీటీ వరకు తెలుగు సినిమాలపై ప్రపంచ వ్యాప్తంగా చర్చ జరుగుతుందన్న ఆయన.. తెలుగు చరిత్ర సుసంపన్నమైందని అన్నారు. అలాగే తెలంగాణ రాష్ట్రం గొప్ప పర్యాటక ప్రాంతంగా ఎదుగుతుందని ప్రధాని కొనియాడారు. రామప్ప ఆలయానికి. పోచంపల్లికి ప్రపం పర్యాటక గ్రామ పురస్కారం లభించిడం ఆనందనీయమని అన్నారు.
అలాగే భక్తికి కులం, జాతి లేదని లోకానికి చాటి చెప్పిన రామానుజాచార్యులు దళితులకు ఆలయ ప్రవేసం చేయించడం చాలా గొప్ప విషయమని ప్రధాని మోదీ వివరించారు. ప్రపంచ పర్యాటక తనమానికంగా సమతా విగ్రహం వెలుగొందుతుందని ఆయన అన్నారు.
అలాగే రామానుజాచార్యుల సమతా సూత్రమే మన రాజ్యాంగానికి స్ఫూర్తి అని వివరించారు. జగద్దురు రామానుజాచార్యుల భోదనలు అనుసరణీయమని ప్రధాని పేర్కొన్నారు. అలాగే రామానుజాచార్యుల విగ్రహం జ్ఞాన, ధ్యానానికి ప్రతీక అని అన్నారు.