పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఈ మధ్య ఎక్కువగా రీమేక్ చిత్రాలైనే దృష్టి పెట్టినట్లు కనిపిస్తోంది. పవన్ రెండో ఇన్నింగ్స్ ప్రారంభం అయినప్పటి నుంచి ఈ చిత్రాలపై ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు. ఇప్పటికీ పింక్ సినిమాను తెలుగులో వకీల్ సాబ్ సినిమాగా రీమేక్ చేయగా.. పవన్ నటించి మెప్పించారు. ఆ తర్వాత అయ్యపనం కోషియం అనే సినిమాను భీమ్లా నాయక్ గా తెలుగులోకి తీసుకురాగా.. ఇందులోనూ పవర్ స్టార్ హీరోగా నటించారు. ఈ సినిమా ఇంకా రిలీజ్ కానప్పటికీ.. అభిమానులు మాత్రం పవన్ సినిమాకు ఆశగా ఎదురుచూస్తున్నారు. ఇటీవలే వచ్చి ప్రేక్షకుల మదిని దోచుకున్న వినోదయా సితం అనే మలయాళ సినిమాను కూడా తెలుగులోకి తీసుకు రానున్నారట. ఇందులోనూ పవన్ కల్యాణ్ యే నటించనున్నట్లు సమాచారం.
నటుడు, దర్శకుడు సముద్ర ఖని ఈ సినిమా తీయగా.. ఆయనే తెలుగులోనూ రీమేక్ చేస్తున్నారు. ఇందులో ఒక పాత్ర పోషించేందుకు పవన్ కల్యాణ్ అంగీకరించినట్లు తెలుస్తోంది. అయితే ఇందులో పవర్ స్టార్ మాత్రం హీరో కాదనే వార్తలు కూడా వస్తున్నాయి. ఆయనది చిన్న పాత్రని.. ప్రధాన పాత్రలో మాత్రం సాయి తేజ్ నటిస్తున్నట్లు కనిపిస్తుంది. త్వరలోనే ఈ సినిమా షూటింగ్ మెదలు కానుందట. ఈ సినిమా చిన్న సినిమా అని.. కేవలం 10 రోజుల్లోనే సినిమా షూటింగ్ పూర్తయ్యే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు. ఇదే కనుక జరిగితే .. పవన్ కల్యాణ్ మూడు రీమేక్ సినిమాలు త్వరగానే వచ్చినట్లు అవుతుంది.
అంతే కాదండోయ్ పవన్ కల్యాణ్ చేతిలో మరో రెండు భారీ చిత్రాలు కూడా ఉన్నాయి. క్రిష్ తీస్తున్న హరిహర వీరమల్లు, హరీష్ శంకర్ దర్శకత్వం వహిస్తున్న భవదీయుడు భగత్ సింగ్ అనే సినిమాల్లో పవన్ నటించనున్నారు. అయితే ఈ సినిమాల షూటింగ్ ఎప్పుడు ప్రారంభం కానుందనేది మాత్రం ఇంకా తెలియాల్సి ఉంది.