మెగా అల్లుడు, హీరో కల్యాణ్ దేల్, శ్రీజ విడాకులు తీసుకున్నారంటూ వార్తలు గుప్పుమన్న విషయం మనందరికీ తెలిసిందే. అయితే వాళ్లిద్దరూ విడిపోయారంటూ వార్తలు వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు వారిద్దరూ స్పందించలేదు. సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉండే వీరు ఈ వార్తల వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు ఎటువంటి పోస్టులు పెట్టలేదు. అయితే శ్రీజ తన ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ నుంచి కల్యాణ్ దేవ్ ని అన్ ఫాలో చేసింది. అది చూస్తేనే వీరిద్దరి మధ్య గ్యాప్ వచ్చిందని అర్థం అవుతుంది. కల్యాణ్ దేవ్ ఇప్పుడు పెడ్తున్న వరుస పోస్టులతో.. అవును అది నిజమేనని తెలిసిపోతుంది.
కల్యాణ్ దేవ్ తన భార్యతో విడాకులు తీసుకున్నాడనే వార్తలు వచ్చిన నాటి నుంచి నేటి వరకు ఎటువంటి పోస్టులు పెట్టలేదు. సంక్రాంతికి తాను హీరోగా నటించిన సూపర్ మచ్చి సినిమా రిలీజ్ అయినా ఒక్క పోస్టు కూడా పెట్టలేదు. దాదాపు ఆరు వారాల తర్వాత వరుసగా ఇన్ స్టా గ్రమ్లో పోస్టులు పెడుతున్నాడు. నువ్వు ఇది చేయలేవు అంటూ ఎవరైనా అంటే పట్టించుకోకు.. నీ పని నువ్వు చేయి అని కొటేషన్ కూడా పెట్టాడు. ప్రస్తుతం తాను చాలా ప్రశాంతంగా.. ఆనందంగా ఉన్నట్లు హింట్ ఇస్తున్నాడు. కల్యాణ్ దేవ్ నటించిన కిన్నెర సాని అనే మరో సినిమా కూడా విడుదలకు సిద్ధంగా ఉంది. అయితే ఆ సినిమాని అయినా కల్యాణ్ ప్రమోట్ చేస్తాడా లేదా అన్నది మాత్రం వేచి చూడాల్సిందే.