అందానికి అందం.. అందుకు తగ్గ తీయని గొంతుతో ప్రేక్షకులని ఉర్రూతలూగించిన సింగర్ సునీత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే ఈమె అందానికి, గొంతుకు వేర్వేరుగా అభిమానలున్నారంటే అతిశయోక్తి కాదు. ఈమెకు ఎంతో మంది దర్శకులు హీరోయిన్ గా ఛాన్స్ ఇస్తామన్నా ఆమె ఒప్పుకోలేదు. కానీ 25 ఏళ్ల పాటు పాటలు పాడుతూ ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకుంది. అయితే ఈమె ఎప్పుడూ అభిమానులకు తన విషయాలను చెబుతూనే ఉంటుంది. సోషల్ మీడియాలో ఎప్పుడూ ఆక్టివ్ గా ఉంటూ తన కొత్త కొత్త అప్ డేట్స్ గురించి వివరిస్తుంటుంది.
అయితే ఏడిది క్రితమే సింగర్ సునీత రెండో పెళ్లి చేసుకున్న విషయం మన అందరికీ తెలిసిందే. 19 ఏళ్లకే మొదటి పెళ్లి చేసుకని.. ఇద్దరు పిల్లలు పుట్టాకా తన మొదటి భర్తతో విడిపోయింది. దాదాపు 15 ఏళ్లు ఒంటరిగా ఉన్న ఆమె… తన పిల్లల సహకారంతో సంవత్సరం క్రితం మరో పెళ్లి చేసుకుంది. తన స్నేహితుడైన మ్యాంగో రామ్ వీరపనేనినితో ఏడడుగులు వేసింది. ఆనాటి నుంచి ఇప్పటి వరకు ఆయనతో ఎక్కడికి వెళ్లినా ఆ ఫొటోలను సోషల్ మీడియా వేదికగా ఫొటోలను షేర్ చేస్తోంది. అయితే తాజాగా సునీత, రామ్ తో కలిసి రంగారెడ్డి జిల్లాలోని ముచ్చింతల్ శ్రీరామనగరం ఆలయానికి వెళ్లారు. అక్కడ భర్తతో గిగిన ఫొటోలను సునీత షేర్ చేసింది.
స్పందించిన ఓ నెటిజన్ నీచంగా కామెంట్ చేశాడు. కాకి ముక్కుకు దొండపండు.. సునీతకు ముసలి మొగుడు.. ఆందం ఆమె సొంతం.. ధనం ఈమె సొంతం.. గానం ఆవడది దర్జా అతనిది అంటూ చాలా చీప్ గా మాట్లాడాడు. దీనిపై సునీత ఫైర్ అయింది. నోటీ దూల నీది.. నీ భారం భూమిది అంటూ రిప్లై ఇచ్చింది. సింగర్ సునీత ఇచ్చి రిప్లైపై చాలా మంది నెటిజన్లు స్పందించారు.
ఇలాంటి వెధవలకు ఇలాగే సమాధానం చెప్పాలంటూ ప్రశంసల వర్షం కురిపించారు. ఆ తర్వాత ఎమోషనల్ అయిన సునీత మీకు నాపై ఉన్న అభిమానాన్ని ఎప్పటికీ రుణపడి ఉంటానని తెలిపింది. తన భర్తపై నెగిటివ్ కామెంట్లు చేసిన వాడికి బుద్ధచ్చేలా చేసిన తనకు సాయంగా నిలబడ్డందుకు ఆనందంగా ఉందని పేర్కొంది. తన కోసం ఇంత మంది స్పందించడం చాలా సంతోషంగా ఉందంటూ ఆనందం వ్యక్తం చేసింది. ఇప్పుడు ఈ టాపిక్ అంతా వైరల్ గా మారింది.