రెండు దశాబ్ధాలుగా తెలుగు ప్రేక్షకులని అలరిస్తూ వస్తున్న మిల్కీ బ్యూటీ తమన్నా ఇప్పటికీ అదే ఫాం కొనసాగిస్తుంది. క్దురితే హీరోయిన్ లేదంటే స్పెషల్ రోల్ అది కాదంటే స్పెషల్ ఐటం సాంగ్ ఇలా ఏదైనా సరే తనకు ఓకే అని చెప్పే తమన్నా సీనియర్, జూనియర్ అనే తేడా లేకుండా అందరితో కలిసి నటిస్తుంది. పెళ్లీడు వచ్చి చాలా ఏళ్లు అవుతున్నా అమ్మడు పెళ్లి ప్రస్థావన మాత్రం ఇప్పటికీ తీసుకురావట్లేదు. అయితే రీసెంట్ గా ఓ చిట్ చాట్ లో భాగంగా తన పెళ్లి గురించి ఆసక్తికరమైన కామెంట్ చేసింది తమన్నా.
అసలైతే ఈ ఏడాది మ్యారేజ్ ప్లాన్ చేద్దామని అనుకున్న తమన్నా ప్రస్తుతం వస్తున్న ఆఫర్ల వల్ల మరో రెండేళ్లు తన పెళ్లి వాయిదా వేసుకున్నానని అంటుంది.ఇంతకీ తమన్నా ఎవరిని పెళ్లాడుతుంది అంటే తన మనసుకి నచ్చిన వాడు ఎవరైనా సరే వాళ్లనే పెళ్లి చేసుకుంటా అంటుంది. అయితే పెళ్లికి మాత్రం మరో రెండు ఏళ్లు టైం తీసుకుంటానని.
తన మ్యారేజ్ విషయం అందరికి చెప్పి చేసుకుంటానని తన పర్సనల్ విషయాల్లో సీక్రెట్స్ ఏమి లేవని. తను ఇప్పటి వరకు ఎవరి ప్రేమలో పడలేదని కూడా చెప్పింది తమన్నా. కెరియర్ ఇప్పటికీఎ సూపర్ స్ట్రాంగ్ గా ఉంటే ఇక అమ్మడికి పెళ్లి మీద ద్యాస ఎలా వెల్తుంద్దని కొందరు అంటున్నారు.