తెలుగు లో పలు న్యూస్ ఛానల్స్ ఉన్నాయి. ఇన్ని ఉన్నా కూడా మరి కొన్ని న్యూస్ ఛానల్స్ వచ్చేందుకు రెడీ అవుతున్నాయి. ప్రముఖ జాతీయ మీడియా సంస్థలు తెలుగు లో మీడియా సంస్థలను ఏర్పాటు చేసేందుకు గాను ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇప్పటికే రిపబ్లిక్ టీవీ వారు తెలుగు లో వారి ప్రత్యేక ఛానల్ ను ఏర్పాటు చేసేందుకు సిద్దం అవుతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. ఇంకా జాతీయ స్థాయి న్యూస్ ఛానల్స్ కొన్ని కూడా తెలుగు లో తమ అదృష్టంను పరీక్షించుకునేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టాయి.
జీ సంస్థ త్వరలో తెలుగు లో న్యూస్ ఛానల్ ను తీసుకు వచ్చేందుకు సిద్దం అయ్యింది. గతంలో జీ 24 గంటలు అని పదేళ్ల క్రితం న్యూస్ ఛానల్ ను ప్రారంభించారు. కాని ఆ న్యూస్ ఛానల్ ఆశించిన స్థాయిలో సక్సెస్ అవ్వలేదు. ఇప్పుడు జీ తెలుగు మరియు జీ సినిమా లు మంచి విజయాన్ని సొంతం చేసుకున్నాయి. ఇదే సమయంలో జీ 5 ఓటీటీ కూడా మంచి ఫామ్ లో ఉంది. ఈ సమయంలో న్యూస్ ఛానల్ ఉండటం మంచిది అనే అభిప్రాయంతో సదరు సంస్థ జీ న్యూస్ ను తీసుకు వచ్చేందుకు సిద్దం అయినట్లుగా వార్తలు వస్తున్నాయి.
జీ తెలుగు న్యూస్ అనే పేరుతో ఈ న్యూస్ ఛానల్ ప్రారంభం కాబోతుంది. గతంలో జీ 24 గంటలు అనే టైటిల్ తో న్యూస్ ఛానల్ ను తీసుకు వచ్చి బొక్క బోర్లా పడ్డ సంస్థ ఇప్పుడు చాలా వినూత్నంగా వార్తలను అందించి జనాల దృష్టిలో పడాలని ప్రయత్నాలు చేస్తోంది. ఎన్ని ప్రయత్నాలు చేసినా.. ఎవరు ఏం అన్నా కూడా టీవీ9, ఎన్టీవీ మరియు టీవీ5 లు మాత్రమే టాప్ లో ఉంటున్నాయి. వీటిని ఢీ కొట్టాలంటే చేరాలంటే చాలా చాలా కృషి అవసరం. అంత కృషి చేసినా కూడా సక్సెస్ అయ్యేనా అనేది మాత్రం నమ్మకం తక్కువే.