ఇటీవల కాలంలో తెలుగు సినిమా పరిశ్రమలో వినిపిస్తున్న ఒకే ఒక్క అంశం ఆంధ్రప్రదేశ్ లో టికెట్లు రేట్లు. అక్కడ టికెట్ల రేట్లు 1960 రేంజిలో ఉన్నాయ్ అంటూ విమర్శలు వినిపిస్తున్నాయి. దాంతో అక్కడ టికెట్ల రేట్లు పెరగాల్సిందే అంటే చాలా మంది డిమాండ్ చేస్తున్నారు. ఇప్పుడు అక్కడ టికెట్ల రేట్లు విషయం గురించి మాట్లాడడం కోసం రామ్ గోపాల్ వర్మ వెళ్లి వచ్చిన విషయం తెలిసిందే.
మంత్రి పేర్ని నాని తో ఆయన మాట్లాడటం ఆ తర్వాత జరిగిన పరిణామాలతో జనాలు పెద్దగా సంతృప్తి చెందుతున్నట్లు గా అనిపించలేదు. టాలీవుడ్ ప్రముఖులు సీఎం జగన్ మోహన్ రెడ్డి తో గతంలో చర్చించడం జరిగింది. ఇప్పుడు రామ్ గోపాల్ వర్మ కూడా మంత్రి తో చర్చించాడు. ఈ రెండు చర్చల వల్ల ఏమైనా ప్రయోజనం జరిగిందా అంటే శూన్యం అంటూ కొందరు విశ్లేషిస్తున్నారు.
రాంగోపాల్ వర్మ పేర్ని నాని ల మధ్య జరిగిన భేటీలో టికెట్లు అంశమై ఎంత వరకు చర్చ జరిగింది అనేది తెలియాల్సి ఉంది. అయితే రామ్ గోపాల్ వర్మ టికెట్ల అంశంపై మాట్లాడుతూ పెంచాలని విజ్ఞప్తి చేసినట్లు మంత్రి పేర్కొన్నాడు. అదే సమయంలో రాంగోపాల్ వర్మ మాట్లాడుతూ తాను టికెట్స్ రేట్ల విషయం మాట్లాడటానికి ఇక్కడికి వచ్చాను. తమ సమస్యలను మంత్రికి చెప్పాను అన్నాడు.
కనుక ఆయన నుండి సానుకూల స్పందన వస్తుందని ఆశిస్తున్నాను. నిర్ణయం ప్రభుత్వం తీసుకోవాల్సింది. ఇంతకు ముందు నిర్ణయం పట్ల సంతృప్తి చెందక పోవడం వల్లే వచ్చినట్లుగా రాంగోపాల్ వర్మ చెప్పాడు. ఈ వివాదం పెద్దది గా మారింది. రాంగోపాల్ వర్మ వెళ్లి ఏదో ఒకటి సాధించి వస్తాడు అనుకుంటే ఆయన ఒట్టి చేతులతో రావటం జరిగింది అంటూ ఇండస్ట్రీ వర్గాల వాళ్ళు చెవులు కొరుకొంటున్నారు.