కరోనా థర్డ్ వేవ్ సెలబ్రెటీలను పట్టి పీడిస్తున్నట్లుగా అనిపిస్తుంది. పెద్ద ఎత్తున కరోనా కేసులు నమోదు అవుతున్నాయి. ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు కరోనా కరోనా అంటున్నారు. మహేష్ బాబు నుండి మొదలుకుని ఎంతో మంది టాలీవుడ్ ప్రముఖులు కరోనా బారిన పడ్డారు. వారిలో చాలా మంది మెల్ల మెల్లగా కోలుకుంటున్నారు. ఇతర భాషల ఇండస్ట్రీకి చెందిన వారు కూడా కరోనా గురించి ఆందోళన చెందుతున్నారు. పలువురు సినీ ప్రముఖులు కరోనా బారిన పడ్డ ఈ సమయంలో రేణు దేశాయ్ మరియు అకీరా నందన్ కూడా కరోనా పాజిటివ్ అంటూ నిర్థారణ అయ్యిందట.
తనకు మరియు అకీరాకు కరోనా సోకింది అంటూ స్వయంగా రేణు దేశాయ్ చెప్పుకొచ్చింది. ఆమె ప్రకటనతో అంతా కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. ఏ ఒక్కరు కూడా అజాగ్రత్తగా ఉండవద్దు. ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తలు పాటిస్తూ కరోనా తో జాగ్రత్తగా ఉండండి అంటూ రేణు దేశాయ్ హెచ్చరించింది. ప్రస్తుతం ఇద్దరం కూడా సేఫ్ గా ఉన్నామని ఆమె చెప్పుకొచ్చారు. కరోనా తో జాగ్రత్తగా ఉండకుంటే తగిన మూల్యం చేల్లించుకోవాల్సి వస్తుందని ఆమె హెచ్చరించింది.
కరోనా ఇప్పుడు ప్రతి ఒక్కరికి దగ్గరగా ఉంది. కనుక తప్పకుండా మాస్క్ లు ధరించాలి. అంతే కాకుండా కరోనా తో అత్యంత జాగ్రత్తగా ఉంటూ ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా ఆమె సూచించింది. కరోనా విషయంలో అజాగ్రత్త ప్రాణాలకు సైతం ప్రమాదం అన్నట్లుగా ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. రేణు దేశాయ్ సోషల్ మీడియా పోస్ట్ తో అకీరాకు ఏమైందో అంటూ పవన్ అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అకీరా మరియు ఆద్యల ఆరోగ్యం విషయంలో పవన్ చాలా జాగ్రత్తలు సూచించినట్లుగా తెలుస్తోంది. ఇప్పుడు రేణు దేశాయ్ వద్ద ఉన్న అకీరా మరియు ఆద్యలను పవన్ ఫోన్ ద్వారా పరామర్శించారని తెలుస్తోంది.