బంగార్రాజు సినిమా విడుదలకు సంబంధించిన మీడియా సమావేశంలో నాగార్జున ఏపీ లో ఉన్న టికెట్ల రేట్ల విషయంలో మాట్లాడను అంటూనే మాట్లాడేశాడు. సినిమా కు సంబంధించిన కార్యక్రమంలో రాజకీయాలు మాట్లాడటం నాకు ఇష్టం లేదు అంటూనే ఏపీలో ఉన్న టికెట్ల రేట్ల గురించి మాట్లాడాడు. ఏపీ లో టికెట్ల రేట్లు మరీ తక్కువగా ఉన్నట్లుగా తాను భావించడం లేదు అనేశాడు. సినిమా టికెట్లు అక్కడ న్యాయ బద్దంగా ఉన్నట్లుగా అభిప్రాయం వ్యక్తం చేశాడు. అంతే కాకుండా తన సినిమాలకు అక్కడ ఉన్న టికెట్ల రేట్లు సరిపోతాయి అన్నట్లుగా కూడా వ్యాఖ్యలు చేశాడు.
ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం టాలీవుడ్ వర్గాల్లో దుమారం రేపుతున్నాయి. ఇప్పడు ఆయన బంగార్రాజు సినిమా విడుదల విషయమై వివాదం ఏర్పడింది. నాగార్జున అలాంటి వ్యాఖ్యలు చేసినందుకు గాను బంగార్రాజును ఏపీలో కాని ఇతర ప్రాంతాల్లో కాని విడుదల చేసేందుకు బయ్యర్లు ముందుకు రావద్దు అంటూ ఒక నిర్ణయానికి వచ్చే అవకాశం కనిపిస్తుంది. అసలు ఇలాంటి ఒక పరిస్థితి వస్తుందని నాగార్జున ఊహించి ఉండడు. బంగార్రాజు సినిమా విషయంలో కొందరు చేస్తున్న విమర్శలకు ఆయన సమాధానం చెప్పాల్సి ఉంది. ఆయన బంగార్రాజు సినిమా ను ఉన్న టికెట్లకు అనుగుణంగా అమ్ముతాడా అంటూ కొందరు ప్రశ్నిస్తున్నారు. అలా అమ్మితే చాలా నష్టం కలుగుతుంది.
కనుక నాగార్జున అలా అమ్మేందుకు అస్సలు ఒప్పుకోడు. అదే విధంగా బంగార్రాజు సినిమా టికెట్ల ను ఏపీ లో తక్కువ రేటుకు అమ్మేందుకు ఆయన ఒప్పుకోడు. ఎందుకంటే వసూళ్లు కనీసం కూడా రావు. కనుక ఆయన ఏదో ప్రభుత్వం వద్ద.. జగన్ వద్ద బ్యాడ్ అవ్వద్దు అనే ఉద్దేశ్యంతో మాట్లాడాడే తప్ప ఆయన ఇండస్ట్రీ గురించి ఆలోచించి ఆయన మాట్లాడలేదు అంటూ విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ఈ సమయంలో నేను టికెట్ల గురించి కాని రాజకీయంగా ఎలాంటి వ్యాఖ్యలు చేయను అంటూ అలాగే ఉంటే నాగార్జున ఎలాంటి వివాదాన్ని ఎత్తుకునే అవకాశం ఉండేది కాదు. కాని ఇప్పుడు మరీ దారుణంగా నాగార్జునను ఏకి పారేస్తున్నారు.