షార్ట్ ఫిల్మ్ లతో ప్రేక్షకులను అలరిస్తూ వచ్చిన అనుదీప్ కేవీ దర్శకుడిగా జాతిరత్నాలు సినిమా తో ఒక్కసారిగా అందరి దృష్టిని ఆకర్షించాడు. మొదటి సినిమా తోనే అంతటి విజయం దక్కడం అంటే మామూలు విషయం కాదు. ఒక మంచి ఫీల్ గుడ్ మూవీని కాకుండా ఫుల్ మాస్ సినిమా ను తెరకెక్కించాలనే ఆయన ఆలోచనకు ప్రతి ఒక్కరు కూడా ఫిదా అయ్యారు అనడంలో సందేహం లేదు. జాతిరత్నాలు సినిమా సూపర్ హిట్ అయిన వెంటనే ఆయనకు బ్యాక్ టు బ్యాక్ ఆఫర్లు వచ్చాయి.
వెంటనే సినిమాను చేస్తాడు అంటూ మీడియాలో వార్తలు వచ్చాయి. కాని ఆయన జాతి రత్నాలు సినిమాను విడుదల చేసిన తర్వాత ఏడాది కాలం పాటు మరే సినిమాను అధికారికంగా ప్రకటించలేదు. ఎట్టకేలకు తమిళ హీరో శివ కార్తికేయన్ తో కలిసి సినిమాను చేయబోతున్నట్లుగా అధికారిక ప్రకటన వచ్చింది. శివ కార్తికేయన్ తమిళ హీరో. ఆయన్ను మనోడు ఎలా ఒప్పించాడు అనేది చర్చనీయాంశంగా మారింది. సరే ఇన్నాళ్లకు అయినా మనోడు శివ కార్తికేయన్ ను ఒప్పించినందుకు అభిమానులు సంతోషంగా ఉన్నారు. సినిమా చిత్రీకరణ అతి త్వరలో ప్రారంభం అవుతుందని అంటున్నారు. శివ కార్తికేయన్ స్వయంగా ఈ సినిమా నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు.
ఈ సినిమాను తమిళంతో పాటు తెలుగు ఇతర భాషల్లో కూడా విడుదల చేయబోతున్నారు. ఒక విభిన్నమైన కాన్సెప్ట్ తో ఈ సినిమాను తెరకెక్కించబోతున్నట్లుగా చెబుతున్నాడు. దాదాపు ఏడాది కాలం పాటు ఈ సినిమా స్క్రిప్ట్ పై వర్క్ చేసినట్లుగా చెబుతున్నారు. అదే కనుక నిజం అయితే ఈ సినిమా తో మరో విజయాన్ని దర్శకుడు అనుదీప్ తన ఖాతాలో వేసుకోవడం ఖాయం అన్నట్లుగా ఇండస్ట్రీ లో టాక్ వినిపిస్తుంది. జాతిరత్నాలు సినిమా తో నవీన్ పొలిశెట్టి కి సూపర్ హిట్ ను అనుదీప్ ఇచ్చాడు. ప్రస్తుతం నవీన్ రెండు సినిమా లను రెండు పెద్ద బ్యానర్ ల్లో చేస్తున్నాడు. అనుదీప్ కూడా పెద్ద బ్యానర్ లో పెద్ద హీరోతో సినిమా చేస్తున్నాడు. మరి ఈ జాతిరత్నాలు ద్వితీయ విఘ్నంను అధిగమిస్తారా అనేది చూడాలి.