అల్లు అరవింద్ సారధ్యంలో మై హోమ్స్ వారి ఆహా ఓటీటీ సూపర్ హిట్ అయ్యి సక్సెస్ ఫుల్ గా దూసుకు పోతుంది. ఆహా ప్రారంభించి రెండేళ్లు అయ్యిందో లేదో అప్పుడే రికార్డు స్థాయి ఖాతాదారులను దక్కించుకుంది. ఇదే సమయంలో సినిమాలు పెద్ద పెద్దవి విడుదల చేసి రికార్డు సృష్టిస్తుంది. ఇక బాలయ్య అన్ స్టాపబుల్ తో ఆహా స్థాయి మరింతగా పెరిగింది అనడంలో సందేహం లేదు. అందుకే ఆహా కు మరింత గా ప్రమోషన్స్ చేస్తున్నారు. ఇప్పుడు ఆహాపురం అనే ట్యాగ్ లైగ్ తో భారీ ఎత్తున ప్రమోషన్స్ చేస్తున్నారు. ఆహా కు బ్రాండ్ అంబాసిడర్ గా అల్లు అర్జున్ వ్యవహరిస్తున్నాడు.
తాజాగా ఆయన పుష్ప సినిమా తో పాన్ ఇండియా స్టార్ గా మారిపోయాడు. దాంతో ఆహా వారు భారీ పారితోషికంను ఆయనకు ఇచ్చి మరీ ప్రమోట్ చేయించుకుంటున్నారు. తాజాగా నటించిన యాడ్ కు గాను ఏకంగా కోటి రూపాయలు తీసుకున్నట్లుగా తెలుస్తోంది. అదే కాకుండా త్వరలో ఆహా వారు నిర్వహించే ఒక భారీ ఈవెంట్ లో కూడా బన్నీ పాల్గొనాల్సి ఉందట. అందుకు గాను కూడా ఈ అమౌంట్ ఇచ్చారనే వార్తలు వస్తున్నాయి. కేవలం రెండు రోజుల షూట్ లో పాల్గొన్నందుకు గాను ఏకంగా కోటి రూపాయల పారితోషికం తీసుకోవడం కేవలం బన్నీకే చెల్లింది అంటూ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.
అయినా అల్లు అర్జున్ ప్రమోట్ చేస్తేనే ఆహా కు మంచి టాక్ వస్తుంది అంటూ నెటిజన్స్ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇక బన్నీ బాబు సినిమా ల విషయానికి వస్తే పుష్ప ఇటీవలే విడుదల అయ్యింది. పుష్ప పార్ట్ 1 కు 300 కోట్లకు పైగా వసూళ్లు నమోదు అయ్యాయి. ఈనెల 7వ తారీకున సినిమాను అమెజాన్ ద్వారా విడుదల చేసేందుకు గాను ఏర్పాట్లు జరుగుతున్నాయి. సినిమా ఇంకా థియేటర్లలో ఉంది. మరో వైపు పార్ట్ 2 కు గాను సుకుమార్ ఏర్పాట్లు చేస్తున్నాడు. పుష్ప పార్ట్ ను కూడా డిసెంబర్ లో విడుదల చేస్తే సెంటిమెంట్ గా కలిసి వస్తుందనే అభిప్రాయం వ్యక్తం అవుతుంది.