విజయ్ దేవరకొండ (Vijay Devarakonda) మరియు రష్మిక మందన్నాల మద్య ప్రేమ వ్యవహారం నడుస్తుంది అంటూ గత మూడు నాలుగు సంవత్సరాలుగా వార్తలు వస్తున్నాయి. అయితే ఆ వార్తలను వారు తేలికగా తీసుకుంటూ స్నేహం అంటూ చెబుతూ వస్తున్నారు. ఇద్దరు కూడా చాలా విషయాల్లో కలిసి మెలిసి ఉంటున్నారు. ఇద్దరు పార్టీ లకు మరియు పబ్ లకు వెళ్లడం మాత్రమే కాకుండా విజయ్ దేవరకొండ ఇంట్లో ఏ చిన్న కార్యక్రమం జరిగినా కూడా అక్కడ రష్మిక ఉంటుంది.
తాజాగా వీరిద్దరు ఇంకా ఆనంద్ దేవరకొండ కలిసి గోవా వెళ్లారు. అక్కడ విజయ్ దేవరకొండ ఇచ్చిన పార్టీలో పాల్గొన్నారు. కొత్త సంవత్సరం కు రష్మిక మరియు రౌడీ స్టార్ లు కలిసి వెల్ కమ్ చెప్పారు. ఇద్దరి మద్య ప్రేమ ఉంది అనేందుకు ఇంత కు మించిన సాక్ష్యం ఏం ఉంటుంది అన్నట్లుగా నెటిజన్స్ మరియు మీడియా వర్గాల వారు ప్రశ్నిస్తున్నారు.
విజయ్ దేవరకొండ పార్టీలో…
ఇప్పుడు కాకున్నా ముందు ముందు అయినా ఖచ్చితంగా వీరిద్దరు కూడా తమ ప్రేమను ఒప్పుకుని తీరాల్సిందే అన్నట్లుగా నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. పెద్ద ఎత్తున వీరిద్దరి ప్రేమ వ్యవహారం గురించి ప్రస్తుతం మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఇప్పుడు కూడా వీరు తమ మద్య ఉన్నది ప్రేమ కాదు.. కేవలం స్నేహం అంటారేమో చూడాలి.
ఇక వీరి సినిమాల విషయానికి వస్తే విజయ్ దేవరకొండ Vijay Devarakonda ప్రస్తుతం లైగర్ సినిమా ను చేస్తున్నాడు. పాన్ ఇండియా స్థాయిలో రూపొందుతున్న ఆ సినిమా ను పూరి జగన్నాద్ దర్శకత్వంలో రూపొందిస్తున్నారు. మరో వైపు రష్మిక ఇటీవలే పుష్ప తో సూపర్ హిట్ దక్కించుకుంది. మరో వైపు హిందీ.. తమిళం మరియు తెలుగు లో వరుసగా అయిదు ఆరు సినిమా లను ఈ అమ్మడు చేస్తున్న విషయం తెల్సిందే. కెరీర్ పరంగా బిజీగా ఉన్న వీరు ప్రేమలో ఉన్నట్లుగా అనిపిస్తుంది.. మరి వారి రియాక్షన్ ఏంటో చూడాలి.