సంక్రాంతికి రావాల్సిన ఆర్ ఆర్ ఆర్ మరియు రాధే శ్యామ్ సినిమాలు వాయిదా పడుతున్నాయి. ఆర్ ఆర్ ఆర్ ఇప్పటికే వాయిదా పడగా రాధే శ్యామ్ కూడా వాయిదా పడటం కన్ఫర్మ్ అయ్యింది. కనుక సంక్రాంతికి పవన్ కళ్యాణ్ నటించిన భీమ్లా నాయక్ ను విడుదల చేస్తారనే వార్తలు వచ్చాయి. మొదట భీమ్లా నాయక్ ను సంక్రాంతికే విడుదల చేయాలని భావించారు. కాని సంక్రాంతి కి బడా సినిమాలు ఉన్నాయంటూ దిల్ రాజు తో కూడిన ప్రొడ్యూసర్స్ సంఘం పవన్ కళ్యాణ్ ను కలిసి వాయిదా వేయించారు. ఇటీవలే వాయిదా పడ్డ భీమ్లా నాయక్ ఆ సినిమాల వాయిదాతో ముందుకు వచ్చే అకవాశం ఉందని.. ఖచ్చితంగా విడుదల అవుతుందని భావిస్తున్న సమయంలో భీమ్లా నాయక్ నిర్మాతలు అయిన సితార ఎంటర్ టైన్మెంట్స్ వారు చేసిన ప్రకటన ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.
భీమ్లా నాయక్ సినిమాను నిర్మించిన సితార ఎంటర్ టైన్మెంట్స్ వారు డీజే టిల్లు అనే సినిమాను నిర్మించారు. ఆ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని విడుదలకు సిద్దంగా ఉంది. సంక్రాంతికి ఆ సినిమాను విడుదల చేయబోతున్నట్లుగా సితార ఎంటర్ టైన్మెంట్స్ వారు ప్రకటించారు. భీమ్లా నాయక్ విడుదల చేయకుండా డీజే టిల్లు విడుదల చేయడం ఏంటీ అంటూ అభిమానులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. భీమ్లా నాయక్ మరియు డీజే టిల్లు రెండు సినిమాల నిర్మాతలు ఒక్కరే కనుక రెండు సినిమాలను సంక్రాంతికి వారు విడుదల చేయాలనుకోరు. కనుక భీమ్లా నాయక్ రావడం లేదని సితార వారు ఇండైరెక్ట్ గా డీజే టిల్లు సినిమా విడుదల తేదీని ప్రకటించి క్లారిటీ ఇచ్చారు. కాస్త ఆలస్యంగా అభిమానులు తేరుకుని భీమ్లా నాయక్ రావడం లేదనే విషయం గ్రహించి సితార వారిపై ట్రోల్స్ చేయడం మొదలు పెట్టారు.
పవన్ కళ్యాణ్ సినిమా విడుదల చేయకుండా ఈ డీజే టిల్లు తీసుకు వస్తున్నారేంటి.. ఇంతకు ఈ డీజే టిల్లు ఎవడ్రా అంటూ పవన్ అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియాలో ప్రస్తుతం ఈ విషయమై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. సంక్రాంతి వంటి అద్బుతమైన సీజన్ లో భీమ్లా నాయక్ ను తీసుకు వస్తే లాభాల పంట.. కలెక్షన్స్ వర్షం ఉంటుంది. అదే డీజే టిల్లును తీసుకు వస్తే ఏం ఉంటుంద్రా బాబు అంటూ సితార ఎంటర్ టైన్‌మెంట్స్ వారిని అభిమానులు ట్రోల్ చేస్తున్నారు. ఇప్పటికి అయినా భీమ్లా నాయక్ సినిమాను తీసుకు రావాలని.. ఈ డీజే గాడిని తర్వాత విడుదల చేసుకోమంటూ సితార వారికి పవన్ ఫ్యాన్స్ సలహా ఇస్తున్నారు. మరి సితార ఎంటర్ టైన్మెంట్స్ వారు నిర్ణయం మార్చుకుంటారా అనేది చూడాలి.