రాజమౌళి దర్శకత్వం లో తెరకెక్కిన ఆర్ ఆర్ ఆర్ సినిమా విడుదల వాయిదా పడింది. దేశ వ్యాప్తంగా ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఉత్తరాదిన లాక్ డౌన్ దిశగా పలు రాష్ట్రాలు అడుగు లు వేస్తున్నాయి. ఇప్పటికే కొన్ని రాష్ట్రాలు ఆంక్షలు విధించాయి. థియేటర్లు నడవని పరిస్థితి అక్కడ ఉంది. కనుక ఆర్ ఆర్ ఆర్ సినిమా ను వాయిదా వేస్తున్నట్లుగా ప్రకటించారు. సంక్రాంతి కానుకగా వస్తా అంటూ భీమ్లా నాయక్ నాలుగు అయిదు నెలలుగా సందడి చేస్తున్నాడు. కాని రాధే శ్యామ్ మరియు ఆర్ ఆర్ ఆర్ సినిమా ల కోసం భీమ్లా నాయక్ సినిమా ను వాయిదా వేయడం జరిగింది. ఆ చిత్రా ల రిక్వెస్ట్ మేరకు ఫిబ్రవరి చివరకు వెళ్లిన భీమ్లా నాయక్ ఇప్పుడు ఆ సినిమాలు వాయిదా పడటం తో వెంటనే రంగంలోకి దిగుతుంది.
ఆర్ ఆర్ ఆర్ సినిమా విడుదల తేదీ విషయంలో అధికారిక ప్రకటన రాకుండానే సంక్రాంతికి భీమ్లా నాయక్ సినిమా విడుదల అన్నట్లుగా ప్రకటన వచ్చింది. కేవలం ఆర్ ఆర్ ఆర్ మాత్రమే కాకుండా రాధే శ్యామ్ కూడా వాయిదా పడటం కన్ఫర్మ్. అందుకే భీమ్లా నాయక్ కు పోటీ అనేది లేదు. సంక్రాంతి వరకు ఒమిక్రాన్ కేసుల సంఖ్య తెలుగు రాష్ట్రాల్లో కాస్త అదుపులో ఉంటే రెండు వారాల్లో భీమ్లా నాయక్ రచ్చ రచ్చ చేసి వంద కోట్ల వసూళ్లను రాబట్టగలడు అంటూ అభిమానులు నమ్మకంగా ఉన్నారు. పెద్ద ఎత్తున అంచనాలున్న భీమ్లా నాయక్ సినిమా షూటింగ్ పూర్తి అయ్యింది. విడుదలకు కూడా సిద్దంగా ఉంది. సెన్సార్ కార్యక్రమాల కోసం వెయిట్ చేస్తున్న భీమ్లా నాయక్ చివరి దశ గ్రాఫిక్స్ వర్క్ ను జరుకుంటుంది. కాస్త అటు ఇటుగా రెండు మూడు రోజుల్లోనే ఆ వర్క్ ను కూడా ముగించే అవకాశం ఉంది.
మొత్తానికి భీమ్లా నాయక్ ను సంక్రాంతి కానుకగా సరిగ్గా జనవరి 14న విడుదల చేయబోతున్నట్లుగా తెలుస్తోంది. మరి కాసేపట్లో అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. ఒమిక్రాన్ కేసుల కారణంగా మొత్తం విడుదల తేదీల విషయంలో గందరగోళం ఏర్పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. సంక్రాంతి బరిలో ఉంటాయనుకున్న సినిమా లేవు.. తప్పకున్న సినిమా మళ్లీ వచ్చింది. ఏంటో ఈ కరోనా మహత్తు అంటూ నెటిజన్స్ చర్చించుకుంటున్నారు. ఇక భీమ్లా నాయక్ విషయానికి వస్తే మలయాళం మూవీ అయ్యప్పనుమ్ కోషియుమ్ కు రీమేక్ అనే విషయం తెల్సిందే. సాగర్ చంద్ర దర్శకత్వం వహిస్తుండా.. త్రివిక్రమ్ రచన సహకారం అందిస్తున్నాడు. సినిమా లో పవన్ కు జోడీగా నిత్యా మీనన్ నటించింది. రానా ఈ సినిమా లో కీలక పాత్రలో నటించాడు.