RRR Movie :టాలీవుడ్ జక్కన్న రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన ఆర్ ఆర్ ఆర్ సినిమా జనవరి 7న సంక్రాంతి కానుకగా ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున విడుదల కాబోతుందని ఎంతో ఆసక్తిగా ఉత్కంఠతతో ఎదురు చూస్తున్న వారికి షాక్ తగిలింది. అనూహ్యంగా ఆర్ ఆర్ ఆర్ సినిమా ను వాయిదా వేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఈ సినిమా పాన్ ఇండియా రేంజ్ లో విడుదల అవ్వాల్సిన సినిమా కనుక అన్ని చోట్ల కూడా పరిస్థితులు పాజిటివ్ గా ఉండాలి. కాని ఉత్తర భారతంలో పరిస్థితి అస్సలు బాగా లేదు.
కొన్ని రాష్ట్రాల్లో లాక్ డౌన్ అమలు అవుతుంటే.. మరి కొన్ని రాష్ట్రాల్లో 50 శాతం ఆక్యుపెన్సీ కొనసాగుతుంది.. మరి కొన్ని చోట్ల నైట్ కర్ఫ్యూ లు ఉన్నాయి. కనుక ఈ సమయంలో అక్కడ విడుదల సాధ్యం కాదు అని తేలిపోయింది. కేవలం సౌత్ ఇండియాలో విడుదల చేసే సినిమా ఇది కాదు. కనుక రిస్క్ వద్దనుకున్న మేకర్స్ తప్పని సరి పరిస్తితుల్లో విడుదల వాయిదా వేయాలనే నిర్ణయానికి వచ్చారు. ఒమిక్రాన్ కేసులు విపరీతంగా పెరుగుతున్న నేపథ్యంలో విడుదల తేదీ సమయంకు పరిస్థితి మరింత కఠినంగా మారే అవకాశాలు కూడా ఉన్నాయి. అందుకే తప్పని సరి పరిస్థితుల్లో అందరితో మాట్లాడి జక్కన్న టీమ్ ఈ సినిమా ను వాయిదా వేయించారని తెలుస్తోంది.
మరి కాసేపట్లో సినిమా విడుదల వాయిదా గురించి ప్రకటన వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఏప్రిల్ నెలలో సినిమా విడుదల ఉంటుందని అంటున్నారు. అది కూడా క్లారిటీ లేదు. రాజమౌళి చాలా నమ్మకంగా ఎట్టి పరిస్థితుల్లో జనవరి 7న విడుదల చేస్తామని చెప్పాడు. 50 శాతం ఆక్యుపెన్సీ తో కూడా విడుదలకు సిద్దం అయ్యారు. కాని మొత్తం థియేటర్లు మూత పడితే ఎలా విడుదల అనుకుని వాయిదా వేయడం జరిగిందని మేకర్స్ చెబుతున్నారు. టాలీవుడ్ జక్కన్న రాజమౌళి ఈ సినిమా ను షురూ చేసి నాలుగు ఏళ్లు అయ్యింది. రెండేళ్లుగా కరోనా వల్ల అదుగో ఇదుగో అన్నట్లుగా వాయిదా లు పడుతుంది. మరి 2022 లో అయినా ఈ సినిమా కు మోక్షం దక్కేనా అనేది చూడాలి.