ప్రతి ఒక్కరూ సినీ ప్రపంచాన్ని రంగుల మయంగా చూస్తారు. కానీ ఆ రంగుల ప్రపంచం వెనక ఉన్న కన్నీటి గాథలు ఎవరికీ పెద్దగా కనపడవనే చెప్పాలి. అనేక మంది ఒకప్పుడు ఇండస్ట్రీల్లో వెలుగు వెలిగి ఇప్పుడు చాలా కన్నీటిగాథలను అనుభవిస్తున్నారు. ప్రస్తుతం కూడా అలాంటి ఘటనే ఒకటి కన్నీల్లు పెట్టిస్తోంది. ఒకప్పుడు బుల్లితెరపై చక్రం తిప్పిన నటి ఇప్పుడు కనీసం చికిత్సకు కూడా డబ్బుల్లేక నానా అవస్థలు పడుతోంది.
కొంత కాలం క్రితం బుల్లితెరపై సాసురల్ సిమర్ కా సీరియల్‌తో చాలా పాపులర్ అయిన నటి షా గుప్త అలీ. ఆమె ఒకప్పుడు చేతినిండా సీరియళ్లు, సినిమాలతో చాలా బిజీగా ఉండేది. కానీ ఇప్పుడు ఆమె చాలా ఆర్థిక కష్టాల్లో కాలం వెల్లదీస్తోంది. పునర్ వివాహ్, వీరా లాంటి ఎన్నో సూపర్ హిట్ సీరియళ్లలో చేసిన ఆమె దాదాపు మెయిన్ రోల్‌కు సమానంగా రెమ్యునరేషన్ తీసుకునేది.
అలాంటి స్టార్ డమ్‌ను అనుభవించిన ఆమె ఇప్పుడు కరోనా కారణంగా అవకాశాలు లేక, ఎవరూ చాన్సులు ఇవ్వకపోవడంతో పనులు దొరక్క కొట్టుమిట్టాడుతోంది. ఇంకో విషయం ఏంటంటే ఆమెకు గత 20ఏళ్లుగా రొమ్ము క్యాన్సర్ ఉండటంతో దానికి చాలానే డబ్బులు పెడుతోంది. ఇప్పటి వరకు ఆ ట్రీట్మెంట్ కోసమే ఆమె తన కారు, నగలు, ఆస్తులు కూడా అమ్మేసి మరీ చికిత్సకు పెట్టుకుంది. ఇక ఇప్పటికే ఆ రోగానికి సంబంధించి 9 కెమోథెరపీ సెషన్లు కూడా ఆమె చేయించకున్నప్పటికీ నయం కాలేదు. నాలుగేండ్లుగా దానికి చికిత్స తీసుకోవడానికి ఆమె వద్ద డబ్బులు కూడా లేవని తెలుపుతోంది. దాంతో పాటే తనకు షుగర్, కంటిచూపు లాంటి అనారోగ్య సమస్యలు కూడా ఉన్నాయని, ఆవేదన చెందుతోంది.